సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం
ఇది ఇలా ఉంటె ఇక తాజాగా తెలంగాణ శాసనసభాపక్షం ఈనెల 7న భేటీ కానుంది. తెలంగాణ భవన్లో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన సాయంత్రం 5 గంటలకు సమావేశం జరగనుంది. సమావేశానికి తెరాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరినీ ఆహ్వానించారు,ఇటీవల మరణించిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి తెరాస శాసనసభా పక్షం సంతాపం వ్యక్తం చేస్తూ తీర్మానం చేయనుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు.