కరోనాకు విరుగుడులా పని చేస్తున్న ఆ వ్యాక్సిన్.... ఐసీఎంఆర్ అధ్యయనం ?
ఒకవైపు రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంటే మరోవైపు ఇప్పటికే అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల గురించి అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వృద్ధ రోగులు ఎక్కువ సంఖ్యలో మరణిస్తుండడంతో.. వారి చికిత్సలోను, మరణాల సంఖ్యను తగ్గించడంలోనూ బీసీజీ వ్యాక్సీన్ సత్ఫలితాలు ఇస్తోందని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
దీంతో ఐసీఎంఆర్ ఈ వ్యాక్సిన్ పై అధ్యయనం చేయడానికి సిద్ధమైంది. 60 నుంచి 95 ఏళ్ళ మధ్య వయస్సుగల రోగులకు ఈ వ్యాక్సిన్ ఇవ్వడానికి గల సాధ్యాసాధ్యాలను ఐసీఎంఆర్ పరిశీలిస్తోంది. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో తొలి దశలో ఈ అధ్యయనాన్ని ఐసీఎంఆర్ నిర్వహించనుంది.