డ్రాగన్ కు మరో షాక్ ... చైనా ఆర్మీతో లింకులు ఉన్న 7 కంపెనీలపై కేంద్రం వేటు...?

Reddy P Rajasekhar

భారత్ చైనా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టినా కేంద్రం డ్రాగన్ విషయంలో కఠినంగానే వ్యవహరిస్తోంది. ఇప్పటికే భారత్ చైనాకు సంబంధించిన 59 యాప్ లపై నిషేధం విధించింది. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ చైనా ఉత్పత్తులను తగ్గించుకునేందుకు కృషి చేస్తోంది. చైనా కంపెనీలతో గతంలో చేసుకున్న పలు ఒప్పందాలను రద్దు చేసుకుంది. తాజాగా కేంద్రం చైనా సైన్యంతో లింకులు ఉన్న 7 కంపెనీలపై నిషేధం విధించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. 
 
 
హువే, అలీబాబా, జిండియా స్టీల్స్, జిన్ జింగ్ కేఫీ ఇంటర్నేషనల్, చైనా ఎలక్ట్రానిక్ టెక్నాలజీ గ్రూప్, టెంసెంట్, సైక్ మోటార్ కార్పొరేషన్ కంపెనీలపై నిషేధం విధించాలని కేంద్రం భావిస్తోంది. ఈ కంపెనీలకు చైనా సైన్యంతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధాలు ఉన్నట్లు కేంద్రం  భావించి ఈ సంస్థలపై గట్టి నిఘా పెట్టినట్లు భారత ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: