గవర్నర్ కు చంద్రబాబు లేఖ.. ప్రజా హక్కుల ను కాపాడడంటూ..?
రాష్ట్రంలో చట్టవిరుద్ధమైన అరెస్టులు, ప్రజలకు వేధింపులు జరుగుతున్నాయని.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 యథేచ్ఛగా రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని.. మాట్లాడే హక్కు భావ ప్రకటన స్వేచ్ఛను కూడా అధికార పార్టీ హరిస్తోంది అంటూ టీడీపీ అధినేత ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి భారీ మొత్తంలో నగదు అక్రమ రవాణా చేస్తున్న నిందితులపై సమగ్ర విచారణ జరిపి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
గ్రామీణ ప్రజలను పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఏకంగా కొట్టడం లాంటి భౌతిక హింస కూడా చేస్తున్నారని ఆరోపించారు. అయితే చట్టప్రకారం సత్వర న్యాయం అందించడంలో మీ గురుతర జోక్యం అనవసరం అంటూ లేఖలో పేర్కొన్న చంద్రబాబు నాయుడు.. మీ జోక్యం ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది అంటూ వ్యాఖ్యానించారు. మరి చంద్రబాబు లేఖపై గవర్నర్ ఎలా స్పందిస్తారు అన్నది చూడాలి మరి.