అసోం వరదలు.. పెరుగుతున్న మృతుల సంఖ్య..?
ఈశాన్య రాష్ట్రాల్లో వర్షం కారణంగా వరద ఉధృతితో జనజీవనం స్తంభించి పోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అసోం రాష్ట్రంలో వరదల ప్రభావం ఇంకా తగ్గలేదు. కొన్ని రోజుల నుంచి అసొం లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో... ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి దీంతో జనజీవనం స్తంభించి పోతుంది.
ఇక మంగళ బుధవారాల్లో భారీ వర్షాలు కురవడంతో పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారిపోయింది. ఇప్పటికే వరదల కారణంగా రాష్ట్రంలోని 30 జిల్లాలు ప్రభావితం అవ్వగా రాష్ట్ర వ్యాప్తంగా 122 రెవిన్యూ సర్కిళ్లలో వరదలు ముంచెత్తాయి. ఇలా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వస్తున్న వరదల కారణంగా ఏకంగా రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా లక్షలమంది ఈ వరదల కారణంగా నిరాశ్రయులయ్యారు,