విశాఖ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదానికి కారణాలివే....?
నిన్న అర్ధరాత్రి విశాఖ రాంకీ ఫార్మాసిటీలోని విశాఖ సాల్వెంట్స్ సంస్థలో భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఒక రకమైన వృథా ఆయిల్‌ను శుభ్రం చేసే ప్రక్రియ జరిగే సమయంలో మంటలు అంటుకున్నాయి. సంస్థ ప్రాంగణంలో ఉన్న కెమికల్ డ్రమ్ములకు కూడా మంటలు అంటుకోవడంతో అవి భారీ శబ్దాలతో పేలిపోయాయి. సంస్థకు పది కిలోమీటర్ల దూరం వరకు శబ్దాలు వినిపించడం ప్రమాద తీవ్రతకు నిదర్శనం.
మొత్తం 17సార్లు పేలుడు శబ్దాలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. మంటల వల్ల విద్యుత్ లైన్లు కూడా తెగి కిందపడ్డాయి. ఈ ఘటనలో మల్లేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. 15 రకాల రసాయనాలు సంస్థలో నిల్వ ఉంటాయి. భారీస్థాయిలో కెమికల్స్ నిల్వ ఉండడం వల్లే ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా తెలుస్తోంది.