అమెరికాలో కరోనాతో పోరులో ఉన్న వైద్య సిబ్బందికి సరి కొత్త బహుమతి..!
కరోనా రోగులకు వైద్యం చేసే సిబ్బందికి ఎన్నిసార్లు అభినందనలు చెప్పినా తక్కువే.. అందుకే కొంతమంది వ్యాపారవేత్తలు వారికి కొన్ని ఆఫర్లు ప్రకటిస్తూ వస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు లో బాగా సుపరిచితమైన ఓ నగల సంస్థ కరోనా మహమ్మారి తో పోరాటం చేస్తున్న సిబ్బందికి ఆఫర్ ప్రకటించింది. అలాగే అమెరికాలో కరోనా రోగులకు సేవచేసే ఆరోగ్య సంరక్షణ కార్మికులకు ఉచిత వెడ్డింగ్ గౌన్లు అందజేయాలని ఎటువంటి లాభం ఆశించకుండా ఓ సంస్థ ముందుకు వచ్చింది.
ఇదేవిధంగా అమెరికాలోని ఓ ఆసుపత్రిలో పనిచేసే నికోల్ హారిస్ అనే ఓ హెడ్ నర్స్ తన అభిప్రాయాన్ని చెప్పారు. తనకి కొద్ది రోజులలో పెళ్లి జరగనుంది. అయినప్పటికీ కరోనా రోగులకు వైద్యం ఇవ్వడం లో తాను అలసి పోతున్నట్లు.. పెళ్లికి షాపింగ్ చెయ్యడానికి సమయం లేదని తెలిపారు. ఇలాంటి సమయంలో ఈ వెడ్డింగ్ గౌన్లు ఉచితంగా రావడం చాలా ఆనందకరమైన సంఘటనని చెప్పారు.
This nonprofit has given wedding dresses to more than 150 health care workers https://t.co/tzM8smiRPR — CNN (@CNN) July 12, 2020