కరోనా కష్టకాలంలో జగన్ 41,000 కోట్ల రూపాయలు సంక్షేమం కోసం ఖర్చు చేశారు : ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి

Reddy P Rajasekhar

వైసీపీ దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ ఏపీ సోషల్ రిఫార్మర్ సీఎం జగన్ అని అన్నారు. జగన్ వల్ల 4 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతోందని చెప్పారు. కరోనా మహమ్మారి వల్ల దేశ జీడీపీ వెనక్కు వెళుతోందని మేధావులు చెబుతున్నారని.... ఇలాంటి సమయంలో కూడా జగన్ సుమారు 41,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. 
 
రాష్ట్రంలో ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. కరోనా కష్ట కాలంలోను జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. పాదయాత్ర సమయంలో జగన్ ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో మొదటి మూడు స్థానాల్లో ఉంచాలని భావించి ఆ దిశగా చర్యలు చేపడుతున్నారని అన్నారు. అవినీతి రహిత ప్రభుత్వం వైసీపీ అని ఆయన అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: