బ్రేకింగ్ : అస్సాం సర్కార్ కీలక నిర్ణయం.... రెండు వారాలు లాక్ డౌన్....?

Reddy P Rajasekhar

అస్సాం రాష్ట్ర ప్రభుత్వం కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. గౌహతిలో ఆదివారం అర్థరాత్రి నుంచి రెండు వారాల పాటు పూర్తి లాక్‌డౌన్‌ విధించనున్నట్లు కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో రాత్రి సమయంలో కర్ఫ్యూ అమలు చేయనున్నట్టు ప్రకటన చేసింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 

 

అస్సాంలో ఈరోజు ఉదయం వరకు 6,321 కరోనా కేసులు నమోదు కాగా 9 మంది మృతి చెందారు. వలస కార్మికులు రాష్ట్రానికి తిరిగి వచ్చిన రోజు నుంచి కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గౌహతి నగరంలో కరోనా వ్యాప్తి మరింత ఎక్కువగా ఉండటంతో రాష్ట్ర సీఎం హిమంత బిస్వా శర్మ రెండు వారాలపాటు పూర్తిగా లాక్‌డౌన్‌ను విధించనున్నట్లు తెలిపారు. కేవలం మందుల షాపులను మాత్రమే అనుమతిస్తామని అన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: