బ్రేకింగ్ : పాకిస్థాన్ కు భారత్ షాక్.... ఏం జరిగిందంటే.....?

Reddy P Rajasekhar

భారత్ దౌత్య సంబంధాల పరంగా కీలక నిర్ణయం తీసుకుని పాక్ కు షాక్ ఇచ్చింది. ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బందిని 50 శాతానికి తగ్గించాలని.... రాబోయే 7 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించింది. అదే సమయంలో ఇస్లామాబాద్‌లోని భారత రాయబార కార్యాలయంలో పని చేస్తున్న 50 శాతం సిబ్బందిని కూడా వెనక్కి రప్పిస్తామని పాక్ విదేశీ వ్యవహారాల శాఖకు తెలిపింది. 
 
పాక్‌ దౌత్య కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు గూఢచర్యం చేస్తున్నట్లు తాజాగా అధికారులు గుర్తించారు. తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించిన భారత్ అధికారులు ఆ అధికారులను ఇస్లామాబాద్ కు పంపించివేశారు. పాక్ దీన్ని అవమానంగా భావించి ఇస్లామాబాద్ లోని భారత అధికారులపై తప్పుడు అభియోగాలు మోపింది. వారి విషయంలో పాక్ వ్యవహరించిన తీరు నచ్చక భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. పాక్ చర్యలు హింస, ఉగ్రవాదానికి ప్రోత్సాహం ఇస్తున్నట్లుగా ఉన్నాయని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: