బ్రేకింగ్:ఈశాన్య రాష్ట్రాల్లో మరో భూకంపం

ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా కేసులతో పాటుగా భూకంపాలు కూడా కాస్త భయపెడుతున్నాయి. అక్కడ కరోనా కేసులు ఏమో గాని భూకంపాలు మాత్రం రెండు మూడు రోజులకు ఒకసారి వస్తూనే ఉన్నాయి. తాజాగా మిజోరాం రాష్ట్రంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.

 

 ఈ రోజు సాయంత్రం “04:16:24 (IST) వద్ద ఐజోల్, మిజోరాంకు తూర్పు-ఈశాన్యంగా 25 కిలోమీటర్ల వద్ద భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది. భూకంప తీవ్రత దెబ్బకు అక్కడి ప్రజలు భయపడిపోయారు. చాలా మంది ఇళ్ళ నుంచి బయటకు పరుగులు తీసారు. ఈ తీవ్రతలో ఏమైనా ఆస్తి నష్టం సంభవి౦చినదా అనేది తెలియాల్సి ఉంది. కాగా గత నెలలో దాదాపు 10 సార్లు భూకంపాలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: