బ్రేకింగ్ : జేసీ ప్రభాకర్ రెడ్డికి కోర్టు షాక్... బెయిల్ తిరస్కరణ...?

Reddy P Rajasekhar

కొన్ని రోజుల క్రితం పోలీసుల సంతకాలు ఫోర్జరీ చేశారని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, అతడి కొడుకు అస్మిత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ బెయిల్ పిటిషన్ కోసం దరఖాస్తు చేసుకోగా కోర్టు ఆ పిటిషన్ ను తిరస్కరించింది. ఈరోజు జేసీ తరపున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ కోసం దరఖాస్తు చేయగా కోర్టు నిరాకరించింది. కోర్టు ప్రభాకర్, అస్మిత్ లను రెండురోజులు పోలీసు కస్టడీకి అనుమతించింది. 
 
అయితే వీరికి సంబంధించిన మరికొన్ని అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. మరో ఐదు కేసుల్లో వీరిద్దరికీ వారెంట్లు జారీ అయ్యాయి. జేసీ బ్రదర్స్ అవినీతికి సంబంధించి కేసులు నమోదు కావడంతో టీడీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరణకు గురి కావడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో టీడీపీ ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: