దారుణం.... ఉత్తరప్రదేశ్ లో మరో నిర్భయ ఘటన...?

Reddy P Rajasekhar

2012 సంవత్సరంలో దేశరాజధాని ఢిల్లీలో నిర్భయ ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన మరవక మునుపే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ప్రతాప్‌గఢ్‌ నుంచి నోయిడాకు వెళ్లే ప్రైవేటు ఏసీ స్లీపర్‌ బస్సులో ప్రయాణిస్తున్న 25 ఏళ్ల యువతిపై బస్సు డ్రైవర్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. లక్నో - మధుర జాతీయ రహదారిపై నిన్న ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. 
 
ఈ ఘటనలో పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయగా మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఘటన జరిగిన సమయంలో బస్సులో పన్నెండు మంది వరకు ఉన్నారని తెలుస్తోంది. బస్సు చివరి సీటులో కూర్చున్న బాధితురాలిని నిందితులు బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు అమలు చేస్తున్నా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: