బ్రేకింగ్ : రూ. 2.25 లక్షల కోట్లతో ఏపీ సంక్షేమ బడ్జెట్... ఆ పథకాలకే అధిక ప్రాధాన్యత....?

Reddy P Rajasekhar

2020 - 2021 ఆర్థిక సంవత్సరానికి ఏపీ పూర్తి స్థాయి బడ్జెట్ ను ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈరోజు శాసనసభకు సమర్పించనున్నారు. మొత్తం రూ. 2.25 లక్షల కోట్లతో అంచనా బడ్జెట్ ను ప్రవేశపెట్టనుండగా తొలి మూడు నెలలకు రూ. 70,994.98 కోట్ల ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపంలో తీసుకురానుంది. ప్రభుత్వం రెండో ఆర్థిక ఏడాదిలో నవరత్నాలలోని పథకాలకే అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రభుత్వం బడ్జెట్ లో అన్నదాతలకు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. 
 
కరోనా విజృంభణ వల్ల క్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పటికీ సీఎం జగన్, బుగ్గన బడ్జెట్ ను జనరంజకంగా తీర్చిదిద్దారు. నవరత్నాలలోని పథకాలన్నింటికీ బడ్జెట్ నుంచి నగదు కేటాయించనున్నారని.... కొన్ని రంగాలకు మాత్రం బడ్జెట్ బయట నుంచి ఖర్చు చేయనుండటంతో కొన్ని కేటాయింపులు బడ్జెట్ లో కనిపించవని సమాచారం. రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు తగిన నిధులను బడ్జెట్ లో కేటాయించారని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: