సుశాంత్ సింగ్ చివరి కర్మలకు హాజరైన శ్రద్దా కపూర్..?
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అకాల మరణం బాలీవుడ్ చిత్ర పరిశ్రమను మొత్తం విషాదంలోకి నెట్టిన విషయం తెలిసిందే. స్వయంకృషితో ఎంతగానో గుర్తింపు సంపాదించి ఎంతో ఆదర్శంగా నిలిచిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకొని చనిపోవడం... అభిమానులను ఎంతగానో వేధిస్తోంది. అయితే నిన్న మధ్యాహ్నం డిప్రెషన్కు లోనైన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే.
అయితే ఈ రోజు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరి కర్మలు జరిగాయి. ఇక చివరి కర్మలకు శ్రద్ధ కపూర్ హాజరయ్యారు. శ్రద్ధ కపూర్ తోపాటు కృతి సనన్ సహా మరి కొంతమంది సినీ ప్రముఖులు కూడా సుశాంత్ సింగ్ చివరి కర్మలకు హాజరయ్యారు.
.@ShraddhaKapoor arrives for the final rites of #SushantSinghRajput.#ShraddhaKapoor pic.twitter.com/T3rUizARst — box office india (@boxofficeindia) June 15, 2020