అచ్చెన్నాయుడి హెల్త్ బులెటిన్ రిలీజ్..
ఏపీ ఈఎస్ఐ స్కాంలో మరొకరి అరెస్ట్‌కు ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈఎస్ఐ స్కాంలో అరెస్టుల పర్వం ఏడుకు చేరుకుంది. జాయింట్ డైరెక్టర్ గోవర్థన్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిన్న మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉప నేత, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. టీడీపీ హయాంలో ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల అక్రమాలకు సంబంధించి అచ్చెన్నాయుడిపై గతంలో ఆరోపణలు వచ్చాయి. దీనిపై కొద్దిరోజులుగా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ని నిన్న అరెస్ట్ చేయడం.. పలు సంచలనాలకు తెరలేపింది.
ఇదిలా ఉంటే అచ్చం నాయుడు ఆరోగ్య పరిస్థితి బాగా లేదని.. అనారోగ్య పరిస్థితిలో ఆయన్ని అరెస్ట్ చేయడం చాలా దారుణం అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తాజాగా అచ్చం నాయుడు హెల్త్ బుటిలెన్ రిలీజ్ చేశారు. అచ్చెన్నాయుడు సుదీర్ఘ ప్రయాణం చేయడంతో గత ఆపరేషన్ గాయం పచ్చిగా మారిందని జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ తెలిపారు.
ఆ గాయానికి చికిత్స అందిస్తున్నామన్నారు. అవసరమైతే మరోసారి ఆపరేషన్ చేస్తామని ఆయన చెప్పారు. అయితే గాయం మానడానికి మరో రెండు మూడు రోజలైనా పట్టవొచ్చని అన్నారు. అయితే ప్రస్తుతం ఆయన వాడుతున్న బీపీ ట్యాబ్ లెట్స్ కంటిన్యూ చేస్తున్నామని.. షుగర నార్మల్ గానే ఉందని అన్నారు.