టీడీపీ ఆఫీస్‌ బాయ్‌లతో అయినా చర్చకు సిద్ధం... లోకేష్ ను విమర్శిస్తూ గడికోట సంచలన వ్యాఖ్యలు...?

Reddy P Rajasekhar

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి మాజీమంత్రి నారా లోకేష్‌ కంటే టీడీపీ ఆఫీస్‌ బాయ్‌లకే ఎక్కువ జ్ఞానం ఉంటే వారితోనైనా తాము చర్చకు సిద్ధమని చెప్పారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఏడాది పాలనలో కుప్పం ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ అందిన సంక్షేమ ఫలాల మీద చర్చకు రావాల్సిందిగా చంద్రబాబు, లోకేష్ ను తాను కోరానని... అందుకు సమాధానంగా బోండా ఉమ తమ తరఫు నుంచి టీడీపీ ఆఫీసు బాయ్‌లను పంపుతామని అన్నారని..... ఆఫీసు బాయ్‌లపై తమ పార్టీకి గౌరవం ఉందని చెప్పారు. 
 
డిగ్నిటీ ఆఫ్ లేబర్‌ను గౌరవించే వ్యక్తులు వైసీపీ నేతలని అన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనతో పోలిస్తే జగన్ ఏడాది పాలనలో పేదలకు, రైతులకు, మహిళలకు, అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగిందని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. నారా లోకేష్‌ కంటే మీ ఆఫీసు బాయ్‌లకే ఎక్కువ అవగాహన ఉందని ప్రకటిస్తే వారితోనైనా చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: