నా అభిమాన సూపర్ స్టార్ ఆయన... కృష్ణ బర్త్ డే పై రోజా స్పెషల్ ట్వీట్....!
ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. సినీ ప్రముఖుల నుంచి, రాజకీయ ప్రముఖుల నుంచి కృష్ణకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సినీ నటి, జబర్దస్త్ హోస్ట్, వైసీపీ ఎమ్మెల్యే రోజా కృష్ణకు ట్విట్టర్ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. రోజా " ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్టర్ గా పేరు గాంచి నాలాంటి ఎంతో మంది నటులకు స్ఫూర్తిగా నిలిచిన నా అభిమాన సూపర్ స్టార్ కృష్ణ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు" అని ట్వీట్ చేశారు.
చిరంజీవి, మహేష్ బాబు, మంజుల, సుధీర్ బాబు, బండ్ల గణేష్, ఇతర సినీ ప్రముఖులు కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కెరీర్ మొదట్లో చిన్న పాత్రల్లో నటించిన కృష్ణ తేనె మనసులు సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. 1942 మే 31న జన్మించిన 340కు పైగా సినిమాల్లో నటించారు. కృష్ణ నటుడిగానే కాక నిర్మాతగా, దర్శకునిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్టర్ గా పేరు గాంచి నాలాంటి ఎంతో మంది నటులకు స్ఫూర్తిగా నిలిచిన నా అభిమాన సూపర్ స్టార్ కృష్ణ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.#HBDSuperstarKrishnaGaru pic.twitter.com/uK0XZ1Vd5Z — Roja Selvamani (@RojaSelvamaniRK) May 31, 2020