ఆలోచింపజేస్తున్న అనంత శ్రీరామ్ పాట... కరోనా వారియర్స్ కు సెల్యూట్ చేస్తూ...?
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 62 కరోనా కేసులు నమోదు కావడంతో కేసుల సంఖ్య 1761కు చేరింది. రాష్ట్రంలో కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి, అదే సమయంలో పేద ప్రజలను, సామాన్యులను ఆదుకోవడానికి పోలీసులు, వాలంటీర్లు, జీ.హెచ్.ఎం.సీ సిబ్బంది, వైద్యులు ఎంతో కష్టపడుతున్నారు. వారి సేవలకు హ్యాట్సాఫ్ చెబుతూ హైదరాబాద్ సీపీ సజ్జనార్ అనంత శ్రీరామ్ రాసిన పాటను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
సమాజసేవకు నడుం కట్టే సైన్యం అంటూ సాగిన ఈ పాట ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది. కరోనా వారియర్స్ ప్రజల కోసం పడుతున్న కృషిని తెలియజేస్తోంది. సీపీ సజ్జనార్ ప్రజలకు సేవ చేస్తున్న స్వచ్చంద సంస్థలకు, సైబరాబాద్ పోలీసులకు, వాలంటీర్లకు అంకితం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ పాటను కోటి సాలూరి కంపోజ్ చేయగా హేమచంద్ర పాడారు.
A song dedicated to the services of @SCSC_Cyberabad &other volunteers who worked round the clock along with @cyberabadpolice to serve the needy during #COVIDpandemic. Song written by #Anantha_Sriram garu sung by @itsvedhem & composed by @kotisalur https://t.co/moAzt0oeZ6 pic.twitter.com/m7qRUEY2GD — Cyberabad police (@cyberabadpolice) May 23, 2020