20 లక్షల కోట్లు : మత్స్యకారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త
కేంద్ర అర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మత్యకారులకు శుభవార్త చెప్పారు. మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందజేస్తామని అన్నారు. ఈ కార్డుల ద్వారా మత్స్యకారులు రుణాలు పొందవచ్చని అన్నారు. పాడి రైతులకు కూడా కేంద్రం కిసాన్ క్రెడిట్ కార్డులు అందజేస్తుందని ప్రకటన చేశారు. గ్రామీణ మౌలిక సదుపాయాల కోసం 4,200 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కోసం 6,700 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు చెప్పారు.
ఉపాధి హామీ పథకం కింద 10,000 కోట్ల రూపాయలు బట్వాడా చేశామని అన్నారు. వ్యవసాయ రుణాలపై మూడు నెలల మారటోరియం విధిస్తున్నామని... రుణాలు చెల్లించే రైతులకు మే 31 వరకు వడ్డీ రాయితీ పొడిగింపు ఇస్తున్నామని అన్నారు. సన్నకారు రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని తెలిపారు. కిసాన్ కార్డుదారులకు 25,000 కోట్ల రూపాయల రుణాలు ఇస్తామని అన్నారు.