తెలంగాణలో కరోనా విజృంభణ... 41 పాజిటివ్ కేసులు నమోదు...?

Reddy P Rajasekhar

గత రెండు రోజులుగా అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కూడా భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈరోజు 41 కొత్త కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఈరోజు నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1367కు చేరింది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 34కు చేరింది. 
 
ఈరోజు నమోదైన కేసుల్లో ఎక్కువ కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదయ్యాయి. కొంతమంది వలస కార్మికులు కరోనా భారీన పడినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్రంలో కొత్త కేసులు నమోదు కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: