విశాఖ ఘ‌ట‌న‌పై సీఎం జ‌గ‌న్ సీరియ‌స్‌... వాళ్ల‌కు మూడిన‌ట్టే...!

Reddy P Rajasekhar

ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా 2000 మందికి పైగా అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. గ్యాస్ లీకేజీ జరిగిన ప్రాంతానికి మరికాసేపట్లో సీఎం జగన్ చేరుకోనున్నారు. ఇప్పటికే కలెక్టర్ వినయ్ చంద్ కు ఫోన్ చేసి సీఎం ఈ ఘటన గురించి ఆరా తీశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం, ఫ్యాక్టరీ ఓపెన్ చేయడానికి అనుమతులు ఇచ్చిన అధికారులపై సీఎం సీరియస్ అయ్యారని సమాచారం. 
 
ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని తేలితే మాత్రం ఫ్యాక్టరీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. జగన్ రసాయన వాయువు విడుదలైన బాధిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. గ్యాస్ తీవ్రతకు పలు ప్రాంతాల్లో పశువులు మృతి చెందగా, చెట్లు, మొక్కలు నల్లగా మాడిపోయాయి. మంత్రి అవంతి శ్రీనివాస్ ఈరోజు ఉదయం నుంచి సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: