ప్రేమ గురించి భావోద్వేగ పోస్ట్ చేసిన బిపాసా బసు... శుభాకాంక్షలు చెబుతున్న నెటిజన్లు..?

Reddy P Rajasekhar

బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బసు 4వ వివాహ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా ఈరోజు సోషల్ మీడియా ఖాతాలలో భావోద్వేగంతో కూడిన పోస్టులు చేశారు. ఆ పోస్ట్ లో ప్రేమ కంటే గొప్ప ఎమోషన్ ఉంటుందని తాను అనుకోవడం లేదని చెప్పారు. ప్రేమకు మించిన శక్తి దేనికీ ఉండదని అన్నారు. నేను ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నానో ఆ వ్యక్తి నాకు తోడుగా ఉండటంతో ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. 
 
ప్రతిరోజూ తాము చిన్నచిన్న ఆనందాల కోసం ఎదురు చూస్తామని.... ఆ ఆనందాలు తమ జీవితంలో కృతజ్ఞతను నింపుతాయని తెలిపారు. ప్రేమ, పాజిటివిటీ, విశ్వాసం, నమ్మకం, కృతజ్ఞత ఒకరిపై ఒకరికి ఉండటమే తమ నినాదమని అన్నారు. ప్రతిరోజూ ప్రేమను సెలబ్రేట్ చేసుకోవాలని.... మీ ఆశీర్వాదాలతో సంతోషంగా జీవించాలని అన్నారు. సమయం వేగంగా గడిచిపోతుందని... ఇష్టమైన పనులను వేగంగా చేయాలని..... అందమైన జ్ఞాపకాలను, అనుభూతులను తమతోనే ఉంచుకోవాలని చెప్పారు. 
 
వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతూ బిపాసా బసు పోస్ట్ చేశారు. బిపాషా బసు నాలుగేళ్ల క్రితం ఏప్రిల్ 30న ప్రియుడు, నటుడు కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌ని ముంబైలో ఓ ప్రముఖ హోటల్లో వివాహం చేసుకున్నారు. 

 

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
There is no emotion that is bigger than {{RelevantDataTitle}}