రాముడిగా కొలుస్తుంటే సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికేశాడు !

Vimalatha
రామానంద్ సాగర్ నిర్మించిన సీరియల్ 'రామాయణం' అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమం. 1987లో DD నేషనల్‌లో ప్రసారమైన ఈ షోకి 100 మిలియన్ల మంది వీక్షకులు ఉన్నారు. వాల్మీకి రామాయణం, తులసీదాస్ రామచరితమానస్ ఆధారంగా ప్రతి ఇల్లు ఈ కార్యక్రమం ప్రసారం కోసం వేచి ఉండేది. ఈ సీరియల్ కు ఎంతగా పాపులారిటీ వచ్చిందంటే ఈ షోలో నటీనటులను అసలు దేవుళ్ళుగా భావించడం మొదలుపెట్టారు.
జనవరి 12, 1958న జన్మించిన అరుణ్ గోవిల్ ఈ సీరియల్ షోలో రాముడి పాత్రను పోషించాడు. నేటికీ ప్రజలు ఆయనను శ్రీరాముడిగా కొలుస్తున్నారు. అందుకే అరుణ్ గోవిల్ పుట్టినరోజు సందర్భంగా రామాయణం షూటింగ్ సమయంలో రాముడితో జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకుందాం.
రామాయణానికి ఊహించని ఆదరణ లభించడంతో అందులోని నటులు చాలా ప్రసిద్ధి చెందారు. ఎవరైనా రాముడిగా నటించిన అరుణ్ గోవిల్ ని చూసినప్పుడు, వెంటనే వెళ్లి అతని పాదాలను తాకేవారు. ప్రజలు అతనిలో రాముడిని చూడటం ప్రారంభించారు. అయితే ఆ సమయంలో నేను ఎక్కువగా పొగతాగేవాడినని అరుణ్ గోవిల్ చెప్పారు. "షూటింగ్‌కి విరామం దొరికిన వెంటనే సెట్‌లో తెర వెనుకకు వెళ్లి సిగరెట్‌ తాగడం మొదలుపెట్టాను. ఒక అపరిచితుడు నా దగ్గరకు వచ్చి తన భాషలో నాతో ఏదో చెప్పడం ప్రారంభించాడు. ఆ వ్యక్తి మిమ్మల్ని రాముడిగా భావిస్తున్నామని, మీరు ఇక్కడ సిగరెట్ తాగుతున్నారని చెప్పారు. నేను అతని మాటలతో కదిలిపోయాను. అప్పటి నుంచి  రోజు వరకు నేను ఎప్పుడూ సిగరెట్ ముట్టుకోలేదు" అని చెప్పారు.
అరుణ్ గోవిల్ 'పహేలీ' చిత్రంతో పెద్ద తెరపైకి అడుగుపెట్టాడు. 'సావన్ కో ఆనే దో', 'అయ్యాష్', 'భూమి', 'హిమ్మత్వాలా', 'దో ఆంఖేన్ బరాహ్ హాత్' మరియు 'లవ్ కుష్' వంటి చిత్రాలలో నటించే అవకాశం వచ్చింది. కొంత కాలం తర్వాత 1987లో దూరదర్శన్‌లో రామానంద్ సాగర్ దర్శకత్వంలో 'రామాయణం' సీరియల్ వచ్చింది. ఈ సీరియల్‌లో రాముడి పాత్రను పోషించడానికి అరుణ్ గోవిల్ ఎంపికయ్యారు. ఈ సీరియల్ ప్రసారమైన కొద్ది రోజుల్లోనే ఎవరూ ఊహించని స్థాయిలో పాపులారిటీ వచ్చింది. ఏడాది పాటు సాగిన ఈ సీరియల్ తర్వాత అరుణ్ బుద్ధుడు, శివుడు, రాజా హరిశ్చంద్ర వంటి పాత్రల్లో నటించాడు అరుణ్.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: