బర్త్ డే : పట్టు వదలని విక్రమార్కుడు బెల్లంకొండ తనయుడు

Vimalatha
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఈ యంగ్ హీరో గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు శ్రీనివాస్. అతను లాస్ ఏంజిల్స్ (USA)లోని లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్ మరియు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ లో, ముంబై లోని బారీ జాన్ యాక్టింగ్ స్టూడియోలో యాక్టింగ్ కోర్సు పూర్తి చేశాడు. ఆయన మార్షల్ ఆర్ట్స్ మరియు స్టంట్స్ కోసం వియత్నాంలో వృత్తిపరమైన శిక్షణ కూడా పొందాడు. శ్రీనివాస్ తమ్ముడు గణేష్ బెల్లంకొండ నటుడిగా టాలీవుడ్ అరంగేట్రం చేయబోతున్నాడు.
శ్రీనివాస్ 2014 తెలుగు చిత్రం 'అల్లుడు శీను'తో అరంగ్రేటం చేశాడు. ఇందులో ప్రకాష్ రాజ్‌కీలకపాత్రను పోషించగా, సమంతా రూత్ ప్రభు సరసన నటించాడు శ్రీనివాస్. ఈ చిత్రం విజయం తర్వాత శ్రీనివాస్ 'స్పీడున్నోడు' అనే తమిళ సూపర్ హిట్ చిత్రం 'సుందరపాండియన్' తెలుగు రీమేక్ లో కన్పించాడు. ఇందులో సోనారికా భడోరియా, ప్రకాష్ రాజ్‌లతో కలిసి నటించాడు. తరువాత 'జయ జానకి నాయక' అంటూ రకుల్ ప్రీత్ సింగ్ తో రొమాన్స్ చేశాడు. ఆ తరువాత పూజా హెగ్డే తో 'సాక్ష్యం', కాజల్ అగర్వాల్ తో 'సీత, మెహ్రీన్ పిర్జాదా తో 'కవచం' సినిమాలను చేశాడు.  నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్‌లతో కలిసి అల్లుడు అదుర్స్‌లో నటించాడు. వీటిలో ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. అయినప్పటికీ నిరాశపడకుండా పట్టు వదలని వికమార్కుడిలా ఎన్ని విమర్శలు ఎదురైనా తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన 'రాట్చసన్' అనే మూవీని తెలుగులో రీమేక్ చేయగా, అందులో శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. ఈ సినిమా విడుదలయ్యాక బెల్లంకొండ వారసుడిపై ప్రశంసల వర్షం కురిసింది.  
శ్రీనివాస్ హీరోగా నవంబర్ 2020లో చత్రపతి (2005) హిందీ రీమేక్ ప్రకటించారు. ఈ మూవీ శ్రీనివాస్ బాలీవుడ్ ఫస్ట్ మూవీ. దీనికి దర్శకుడిగా వివి వినాయక్ సంతకం చేశారు. ఆగస్ట్ 2021లో 'స్టూవర్ట్‌ పురం దొంగ' అనే పేరుతో మరో మూవీని ప్రకటించాడు. ఈ రెండు చిత్రాలతో శ్రీనివాస్ మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుందాం.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: