బర్త్‌డే స్పెషల్ : 'ఫక్రే' నుండి 'మీర్జాపూర్' వరకు అలీ ఫజల్ బెస్ట్ మూవీస్

Vimalatha
నటుడు అలీ ఫజల్ సంవత్సరాలుగా అనేక విజయవంతమైన చిత్రాలు, వెబ్ షోలలో ముఖ్యమైన పాత్రలు పోషించారు. తన వయసులో ఉన్న ఇతర నటీనటులతో పోలిస్తే ఆయన సినిమాల ఎంపిక చాలా భిన్నంగా ఉంటుందని చెప్పొచ్చు. ఆయన అక్టోబర్ 15, 1986న ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో జన్మించాడు. అలీ ఫజల్ 2008లో 'ది అదర్ ఎండ్ ఆఫ్ ది లైన్' అనే ఆంగ్ల చిత్రంతో తన నటనా రంగ ప్రవేశం చేసాడు, ఆ తర్వాత 2009లో ఒక అమెరికన్ టెలివిజన్ మినీ సిరీస్ 'బాలీవుడ్ హీరో'లో అతను మాంటీ కపూర్ పాత్రను పోషించాడు. అలీ... రాజ్‌కుమార్ హిరానీ జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రం '3 ఇడియట్స్'తో బాలీవుడ్‌ లోకి అడుగు పెట్టాడు. అప్పటి నుండి అతను తన అద్భుతమైన నటనా నైపుణ్యంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలిగాడు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా అలీ కెరీర్లోనే అత్యుత్తమ సినిమాల గురించి తెలుసుకుందాం.
ఫక్రే
2013లో విడుదలైన 'ఫక్రే' బాలీవుడ్‌ లో అలీకి మొదటి విజయవంతమైన చిత్రం. దీనికి మృగ్దీప్ సింగ్ లాంబా దర్శకత్వం వహించగా, ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వానీ నిర్మించారు. నలుగురు స్నేహితుల చుట్టూ తిరిగే ఈ కామెడీ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చింది.
ఖామోషియాన్
ఖామోషియాన్ విశేష్ ఫిల్మ్స్ బ్యానర్‌పై 2015లో విడుదలైన రొమాంటిక్ థ్రిల్లర్.
హ్యాపీ భాగ్ జాయేగీ
రొమాంటిక్ కామెడీ చిత్రం 2016లో విడుదలైంది. ఇది ఆ సంవత్సరం స్లీపర్ హిట్‌. ఈ చిత్రంలో అలీ ఫజల్ గురుదీప్ సింగ్ అకా గుడ్డు పాత్రను పోషించాడు. 2018లో ఈ చిత్రానికి సీక్వెల్ కూడా వచ్చింది.
విక్టోరియా & అబ్దుల్
2017 నాటి బ్రిటిష్ బయోగ్రాఫికల్ కామెడీ-డ్రామా చిత్రం 'విక్టోరియా & అబ్దుల్'కు స్టీఫెన్ ఫ్రెయర్స్ దర్శకత్వం వహించారు. లీ హాల్ రచించారు. అలీ ఫజల్ ఈ చిత్రంలో అబ్దుల్ కరీం పాత్రను పోషించాడు. ఆయన గొప్ప బ్రిటిష్ నటీమణులలో ఒకరైన జూడి డెంచ్‌తో స్క్రీన్‌ను పంచుకున్నాడు. ఈ చిత్రం వివిధ అంతర్జాతీయ ప్రశంసలతో సత్కరించింది
మీర్జాపూర్
మీర్జాపూర్ విజయవంతమైన భారతీయ వెబ్ సిరీస్. యాక్షన్-క్రైమ్-థ్రిల్లర్ కు అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అందులో అలీ "గుడ్డు" అనే ప్రధాన పాత్రలో నటించాడు. అతను ఆ పాత్రను అద్భుతంగా పోషించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: