యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ లకు కేరాఫ్ అడ్రస్ లింగుసామి

Vimalatha
కోలీవుడ్ దర్శకుడు, కథా రచయిత, చిత్ర నిర్మాత మల్టి ట్యాలెంటెడ్ డైరెక్టర్ లింగుసామి. లింగుసామి 2001 లో మమ్ముట్టి నటించిన కుటుంబ-నాటకంతో దర్శకుడిగా అరంగేట్రం చేసాడు. రన్ (2002), సండకోజి (2005), పైయా (2010) మరియు వేట్టై (2012) వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించి కమర్షియల్ డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన సోదరుడు ఎన్. సుభాష్ చంద్రబోస్ కూడా తన నిర్మాణ సంస్థ తిరుపతి బ్రదర్స్ ద్వారా చిత్రాలను నిర్మించారు.
లింగుసామి తమిళనాడులోని తంజావూరు జిల్లా, కుంభకోణం తాలూకాలోని తిరుచెరై గ్రామానికి చెందినవాడు. తమిళ చిత్రం 'మహాప్రభు-123' సినిమా దర్శకుడు ఎ. వెంకటేష్ వద్ద సహాయ దర్శకుడిగా చేరాడు. ఆ తరువాత మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన తమిళ ఫ్యామిలీ డ్రామా 'ఆనందం'తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అతని రెండవ సినిమా 'రన్'లో మాధవన్ హీరోగా నటించారు. ఈ చిత్రం కమర్షియల్‌గా కూడా మంచి విజయం సాధించడంతో పాటు మంచి రివ్యూలను కూడా అందుకుంది. ఆ తరువాత మాధవన్, లింగుసామి కాంబోలో మరో చిత్రం కూడా అనుకున్నారు. కానీ మాధవన్ అందుబాటులో లేకపోవడంతో ఆ పాత్ర అజిత్ కుమార్‌కి వెళ్లింది. చిత్రానికి కొత్తగా జీ అని పేరు పెట్టారు. లింగుసామి తదుపరి ప్రాజెక్ట్ 'సండకోజీ'లో విశాల్ హీరోగా నటించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద $3.5 మిలియన్లు వసూలు చేసి వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఈ చిత్రంతో లింగుసామి యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లను రూపొందించే దర్శకుడిగా తన పేరును లిఖించుకున్నాడు. ఈ చిత్రం తెలుగులోనూ 'పందెం కోడి' పేరుతో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
ఆ తరువాత 2005లో విక్రమ్ తో చేసిన సినిమా తీవ్ర జాప్యం అనంతరం జనవరి 2008లో విడుదలైంది. 2008లో లింగుసామి తన ఆరవ ప్రాజెక్ట్ కార్తీ, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన 'పైయా '. ఈ చిత్రానికి యావరేజ్ గా సానుకూల సమీక్షలను అందుకుంది. 2014లో సూర్య, సమంతల తారాగణంతో 'అంజాన్' విడుదలైంది. ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. కంటెంట్ లేకపోవడంపై విమర్శకులు విరుచుకుపడ్డారు. సూర్య మరియు సమంతల తెలుగు అభిమానుల కోసం ఈ చిత్రం తెలుగులో కూడా 'సికందర్' పేరుతో విడుదల చేయబడింది. ప్రస్తుతం ఈ దర్శకుడు తెలుగు, తమిళ భాషల్లో రామ్ హీరోగావు  చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: