గుర్తుండిపోయే విలన్ రాహుల్ దేవ్

Vimalatha
రాహుల్ దేవ్ అంటే పెద్దగా తెలియదు కానీ చూస్తే బాగా గుర్తు పడతారు తెలుగు ప్రేక్షకులు. రాహుల్ దేవ్ సినిమా నటుడు మాత్రమే కాదు మాజీ మోడల్ కూడా. 1997లో సినిమా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఇప్పటికి నటిస్తూనే ఉన్నారు. ఈరోజు రాహుల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
ఢిల్లీ బాలాజీ పోలీస్ కమిషనర్ కుమారుడు దేవ్. ఆయన ముకుల్ ఎస్ ఎస్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ' దస్ ' చిత్రంతో విలన్ గా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇద్దామనుకున్నాడు. కానీ ఈ సినిమా నిర్మాణ దశలో ఉన్నప్పుడు దర్శకుడు మరణించడంతో అది అలాగే ఉండిపోయింది. అసంపూర్తిగా మిగిలిపోయిన ఈ సినిమా రిలీజ్ అవ్వలేదు. దీంతో ఆయన నెక్స్ట్ మూవీ 'ఛాంపియన్' లో నటించాడు. 2000లో విడుదలైన ఈ సినిమాలో విలన్ పాత్రను పోషించాడు. 2001లో ఉత్తమ విలన్ గా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నాడు. అలా మొదలైన ఆయన ప్రయాణం మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా విలన్ పాత్రలతో ప్రేక్షకులను భయపెట్టాడు. అతని నిజ జీవితంలో కూడా విలన్ ఏమో అనిపించేలా పాత్రలను ఎన్నుకునేవాడు. తెలుగులో  టక్కరి దొంగ, సింహాద్రి, సీతయ్య, ఆంధ్రావాలా, మాస్, నరసింహుడు, అతడు, అల్లరి పిడుగు, జై చిరంజీవ, చిన్నోడు, పౌర్ణమి, వీర, దమ్ము, నాయక్, ఎవడు, లౌక్యం వంటి చిత్రాల్లో నటించారు. అని చివరగా నటించిన తెలుగు చిత్రం 'ఇంటిలిజెంట్'. ఇక రాహుల్ ఒక్క తెలుగులోనే కాకుండా హిందీ, బెంగాలీ, కన్నడ, మలయాళం, ఒడియా, పంజాబీ, తమిళ చిత్రాల్లో కూడా నటించి ప్రేక్షకులను అలరించారు.
ఆయన వ్యక్తిగత జీవితం విషయానికొస్తే రాహుల్ భార్య రీనా 2019 మే 16న క్యాన్సర్ కారణంగా మరణించింది. ఆయనకు ఒక కుమారుడు సిద్ధార్థ్ ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: