బర్త్ డే : అప్పుడు స్కూల్ ఫీజుకు డబ్బు లేదు... ఇప్పుడు జాతీయ అవార్డు గ్రహీత

Vimalatha
ఈ రోజు బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ కుమార్ రావు పుట్టినరోజు. ప్రత్యేకమైన పాత్రల్లో నటిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్పెషాలిటీని, క్రేజ్ ను తెచ్చుకున్న నటుడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో రాణించడం చాలా కష్టం అంటారు. అయితే కొంతమంది మాత్రం అలాంటి విషయాలకు జడవకుండా రాక్షస ప్రయత్నం, పట్టుదలతో స్టార్లుగా ఎదురుతారు. అలాంటి వారి జాబితాలో రాజ్ కుమార్ ముందుంటాడు. ఈరోజు రాజ్ కుమార్ బర్త్ డే సందర్భంగా ఆయనకు సంబంధించిన ఆసక్తికర విషయాలు మీ కోసం.
 రాజ్‌కుమార్ అన్ని రకాల పాత్రలకు సరిపోతాడు. ఎలాంటి పాత్రలోకైనా అవలీలగా పరకాయ ప్రవేశం చేసేస్తాడు. రాజ్‌కుమార్ రావు మొదట అమితాబ్ బచ్చన్ 'రాన్' చిత్రంలో కనిపించారు. కానీ 'కై పో చే' అనే చిత్రంతో మంచి నటుడిగా ఆయనకు గుర్తింపు లభించింది.
రాజ్ కుమార్ తన వయస్సులో ఉన్న నటులందరిలో అత్యంత భిన్నమైన, సరదా వ్యక్తిత్వం గల వాడని ఆయన గురించి తెలిసిన వారు చెబుతుంటారు. రాజ్ కుమార్ రావు అసలు పేరు రాజ్ కుమార్ యాదవ్. ఆయన 31 ఆగస్టు 1984న గురుగ్రామ్‌లో జన్మించాడు. చిన్న వయస్సులోనే రాజ్ కుమార్ కు నటనపై మనసు మళ్లింది. అప్పుడే సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నాడు.
రాజ్‌కుమార్ తన స్కూలు రోజుల నుండే థియేటర్ ఆర్ట్స్ గురించి తెలుసుకోవడం ప్రారంభించాడు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ఆత్మారం సనాతన ధర్మ కళాశాలలో గ్రాడ్యుయేట్ చేస్తున్నప్పుడు రాజ్‌కుమార్ రావు గురుగ్రామ్ నుండి ఢిల్లీకి థియేటర్‌ లో సినిమా చూడడానికి వెళ్లేవారు.
ఒకసారి రాజ్‌కుమార్ తాను దారుణమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాను అని వెల్లడించాడు. ఒకప్పుడు స్కూలు ఫీజు కోసం కూడా తన దగ్గర డబ్బు లేదని, అటువంటి పరిస్థితిలో ఆయన టీచర్లంతా కలిసి రెండేళ్ల పాటు రాజ్ కుమార్ కోసం ఫీజులు చెల్లించారని వెల్లడించారు.
ముంబై వచ్చిన తర్వాత కూడా రాజ్‌కుమార్ చాలా కష్టపడాల్సి వచ్చిందట. తన స్నేహితుడితో కలిసి బైక్‌పై ఆడిషన్‌కు వెళ్లేవాడని చెబుతారు. ఆ సమయంలో అందంగా కనిపించడానికి ఆయన ముఖానికి రోజ్ వాటర్ అప్లై చేసేవాడట. అయితే ఆడిషన్లలో ఎంపిక కాకపోయినా ఎప్పుడూ నిరాశ పడకుండా మరో ప్రయత్నం చేసేవాడట.
'షాహిద్' చిత్రంలో రాజ్ కుమార్ న్యాయవాది 'షాహిద్ అజ్మీ' పాత్రను పోషించాడు. ఈ పాత్రలో ఆయన నటనకు జాతీయ అవార్డు లభించింది. ఇంకా ఆయన నటించిన అన్ని సినిమాలు మినిమమ్ గ్యారంటీ హిట్. రాజ్ కుమార్ చివరిసారిగా "రూహి" చిత్రంలో కనిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: