హెరాల్డ్ బర్త్ డే : 26-08-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?

frame హెరాల్డ్ బర్త్ డే : 26-08-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?

praveen
ఆగస్టు 26వ తేదీన ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జననాలు  జరిగాయి. మరొక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో  తెలుసుకుందాం రండి.



 మదర్ తెరిసా జననం : రోమన్ కాథలిక్ సన్యాసి... భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ ఆఫ్ చారిటీ భారతదేశంలో కలకత్తాలో 1950 లో స్థాపించారు మదర్ తెరిసా. మదర్ తెరిస్సా 1910 ఆగస్టు 26వ తేదీన జన్మించారు. 45 సంవత్సరాల పాటు మిషనరీస్ ఆఫ్ చారిటీ ని భారత దేశంతో పాటు ప్రపంచ దేశాల్లో విస్తరించేలా మార్గ దర్శకత్వం వహిస్తూ పేదలకు రోగగ్రస్తులనూ అనాధలకు పరిచర్యలు చేశారు మదర్ తెరిసా, అంతర్జాతీయ కీర్తిని పొందిన మదర్ తెరిసా మానవ సేవకు గాను 1979 లో నోబెల్ శాంతి పురస్కారాన్ని... 1980లో భారత రత్న పురస్కారాన్ని కూడా పొందారు,



 మేనక సంజయ్ గాంధీ జననం : ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మహిళా శిశు సంక్షేమ శాఖకు  కేంద్ర మంత్రిగా పనిచేసిన మేనకా గాంధీ 1956 ఆగస్టు 26వ తేదీన జన్మించారు. ఈమె ఒక జంతు హక్కుల ఉద్యమకర్త. ప్రముఖ భారత రాజకీయ నేత అయిన సంజయ్ గాంధీ భార్య మేనకా గాంధీ, మేనకా గాంధీ నాలుగు  ప్రభుత్వాలలో మంత్రిగా పని చేశారు. నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన సభ్యురాలైన మేనకా గాంధీ ఎన్నో  రాజకీయ పదవులను అలంకరించారు. ఇక తాను చేపట్టిన అన్ని శాఖలను ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తూ.. రాజకీయ ప్రస్థానాన్ని ఎంతో విజయవంతంగా కొనసాగించారు.



 మధుప్రియ : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ మధుప్రియ 1997 ఆగస్టు 26వ తేదీన జన్మించారు. ఫోక్  సాంగ్స్ ద్వారా ఎంతగానో గుర్తింపు సంపాదించిన మధుప్రియ చిన్న వయసులోనే శ్రీకాంత్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆడపిల్లనమ్మా అనే పాట ద్వారా ఎంతగానో గుర్తింపు సంపాదించిన మధుప్రియ... ఆ తర్వాత క్రమక్రమంగా సినిమాలో పాటలు పాడే అవకాశం కూడా దక్కించుకున్నారు. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 లో కంటెస్టెంట్ గా వచ్చిన మధుప్రియ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ సుపరిచితురాలు గా మారిపోయారు. ప్రస్తుతం మంచి గుర్తింపు ఉన్న నేపథ్యగాయనిగా తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు మధుప్రియ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: