హెరాల్డ్ బర్త్ డే : 15-08-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?

praveen
ఆగస్టు 15వ తేదీన ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూస్తే  ఎంతో మంది ప్రముఖులు జననాలు జరిగాయి .మరి  ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో  తెలుసుకుందాం రండి.

 రాళ్లపల్లి జననం  : తెలుగు చిత్ర పరిశ్రమలో రాళ్లపల్లి గా సుప్రసిద్ధుడైన రాళ్ళపల్లి నరసింహ రావు తెలుగు సినిమా రంగస్థలం నటుడిగా  ఎంతో గుర్తింపు సంపాదించారు . ఈయన 1955 ఆగస్టు 15వ తేదీన జన్మించారు. చిన్నతనం  నుంచి నాటకాల్లో  ఎంతో మక్కువ కనబరిచిన రాళ్ళపల్లి నరసింహ రావు ఎనిమిది వేలకు పైగా నాటక ప్రదర్శనలు నటించారు. ఇక ప్రస్తుతం  తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో ఉన్నత భావాలు ఉన్న రచయిత  తనికెళ్ల భరణి కి రాళ్ళపల్లి  మార్గదర్శి . తెలుగు చిత్ర  పరిశ్రమలో  నటుడిగా ఎంతో విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగించారు రాళ్ళపల్లి.ఎన్నో  వైవిధ్యమైన పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.

 సుహాసిని జననం : దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి సుహాసిని 1961 ఆగస్టు 15వ తేదీన జన్మించారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం ను పెళ్లి చేసుకున్నారు సుహాసిని. నటిగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో ఖ్యాతిని గడించారు సుహాసిని. దశాబ్ద కాలానికి పైగా తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా తన ప్రస్థానాన్ని ఎంతో విజయవంతంగా కొనసాగించారు. 1980 లో తొలిసారిగా నెంజతై  కిల్లాతె  అనే తమిళ సినిమా ద్వారా నటన  ప్రారంభించిన సుహాసిని ఆ తర్వాత... ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి ఎంతో గుర్తింపు సంపాదించారు. తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో నటించిన సుహాసిని ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

 శ్రీహరి జననం : దక్షిణాది చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు శ్రీహరి 1964 ఆగస్టు 15 తేదిన జన్మించారు. ఎక్కువగా ప్రతినాయకుడి  పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన గొప్ప నటుడు శ్రీహరి. కథానాయకుడిగా కూడా ఎన్నో సినిమాల్లో నటించి తనదైన నటనతో... ఎంతోమంది అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. అంతేకాదు తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి వ్యక్తిత్వం కలిగిన నటుడిగా కూడా శ్రీహరి ఎంతో గుర్తింపు సంపాదించారు. 1986లో సినిమాల్లో  స్టంట్ మాస్టర్గా తన కెరీర్ ని మొదలు పెట్టిన శ్రీహరి ఆ తర్వాత అంచలంచలుగా నటుడిగా ఎదిగారు. ధర్మక్షేత్రం అనే సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసి విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా హీరోగా నిర్మాతగా ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి గా తనదైన ప్రతిభను కనబరిచి ఎంతగానో గుర్తింపు సంపాదించారు. ముఖ్యంగా శ్రీహరి తెలంగాణ యాసకు గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చిన నటుడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 లయ జననం : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి కుటుంబ కథా చిత్రాల కథానాయకగా  ఉన్న లయ 1985 ఆగస్టు 15వ తేదీన జన్మించారు. కేవలం నటిగానే కాకుండా జాతీయ స్థాయి చదరంగం క్రీడాకారిణిగా కూడా మంచి గుర్తింపు ఉంది. భద్రం కొడుకో అనే సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన లయ ఆ తర్వాత ఎన్నో ఫ్యామిలీ కథాంశంతో కూడిన సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించింది.

 శ్రీకాంతాచారి జననం : తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు అయిన  శ్రీకాంతాచారి 1986 ఆగస్టు 15వ తేదీన జన్మించారు. చిన్నప్పటినుంచి సమాజసేవలో ముందున్న  శ్రీకాంతచారి... తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమ కార్యక్రమాలన్నింటినీ ముందుండి నడిపించిన శ్రీకాంతాచారి... ఏకంగా తెలంగాణ కోసం ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహుతికి  పాల్పడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: