హెరాల్డ్ బర్త్ డే : 19-07-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?

praveen

జులై 19వ తేదీన ఒకసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు  జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో  తెలుసుకుందాం రండి. 

 

 మంగల్ పాండే జననం  : సిపాయిల తిరుగుబాటులో ప్రముఖులు అయిన  మంగల్ పాండే 1827 జూలై  19వ తేదీన జన్మించారు. ఈయన  1857 సంవత్సరంలో ఓ బ్రిటిష్ అధికారిని కాల్చి చంపాడు. కారణం ఆవు-పంది కొవ్వుతో  తయారుచేసిన తూటాలను బ్రిటిష్ వాళ్ళు  ఇచ్చేవారు. ఆ తూటాలను నోటితో తొక్క తొలగిస్తేనే పేలుతూ  ఉండేవి. ఈ నేపథ్యంలో ఇది హిందూ ముస్లింలు ఇద్దరికీ నచ్చేది కాదు. ఈ నేపథ్యంలోనే  క్రమక్రమంగా సిపాయిల తిరుగుబాటు ఏర్పడింది. దీంతో ఓ రోజు  బ్రిటిష్ అధికారిని కాల్చి చంపాడు.  సిపాయిల తిరుగుబాటు లో ప్రప్రథమ స్వాతంత్ర్య సమర యోధుడు మంగల్ పాండే. 

 

 సముద్రాల రాఘవాచార్య జననం : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ రచయిత, నిర్మాత,  దర్శకుడు, నేపథ్య గాయకుడు అయినా సముద్రాల రాఘవాచార్య 1902 జూలై 19 వ తేదీన జన్మించారు. ఈయన  తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలకు రచయితగా పని చేయడంతో పాటు పలు సినిమాలను సొంత బ్యానర్లోనే నిర్మించాడు. అంతేకాకుండా నేపథ్య గాయకుడిగా కూడా తన గాత్రంతో ఎంతో మంది సంగీత ప్రేక్షకులను అలరించారు. ఇక ఈయన వినాయక చవితి, భక్త రఘునాథ్ లాంటి పలు సినిమాలకు  దర్శకత్వం కూడా వహించారు. దాదాపుగా 80 చిత్రాలకు రచయితగా పనిచేసి ఎంతగానో గుర్తింపు సంపాదించారు. 


 రోజర్ బిన్నీ జననం : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు అయిన రోజర్ బిన్నీ 1955 జూలై 19 వ తేదీన జన్మించారు. భారత క్రికెట్ జట్టులో ఆల్ రౌండర్ గా రోజర్ బిన్నీ ఎంతగానో గుర్తింపు సంపాదించారు. 1983లో మొదటిసారి భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ అందుకున్న జట్టులో ఎంతగానో ప్రతిభను కనబరిచాడు రోజర్ బిన్నీ. ప్రపంచ కప్ లో మొత్తంగా 18 వికెట్లు సాధించి అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా  రికార్డు సృష్టించాడు. ఇక ఆ తర్వాత జరిగిన వరల్డ్ సిరీస్ క్రికెట్ చాంపియన్ షిప్ లో  కూడా మరోసారి తన ప్రతిభను నిరూపించుకునీ 17 వికెట్లు సాధించాడు. ఎన్నో ఏళ్ల  పాటు జట్టులో కీలక ఆటగాడిగా  కొనసాగిన రోజర్ బిన్నీ జట్టును  ఎన్నోసార్లు విజయతీరాలకు చేర్చాడు. 

 

 రాజేంద్రప్రసాద్ జననం : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ సినీ నటుడు,  నిర్మాత, సంగీత దర్శకుడు అయిన రాజేంద్రప్రసాద్ 1956 జూలై 19 వ తేదీన జన్మించారు. ముఖ్యంగా హాస్య నటుడిగా తన సినీ కెరీర్ ని ప్రారంభించిన రాజేంద్ర ప్రసాద్ ఆ తర్వాత హీరోగా కూడా పలు సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్ తో  చిన్నప్పటి నుంచి రాజేంద్ర ప్రసాద్ కి ఉన్న పరిచయం ఆయనను  నటన వైపు నడిపించింది . ఎన్టీఆర్ ఇచ్చిన సలహాతో 1977లో రాజేంద్రప్రసాద్ సినిమాల్లోకి  అడుగెట్టాడు.  బాపు  దర్శకత్వం వహించిన స్నేహం అనే సినిమా ద్వారా తన సినీ కెరీర్ ను ప్రారంభించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కమేడియన్గా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న రాజేంద్రప్రసాద్ ఎన్నో వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. 


 మాళవిక జననం : దక్షిణాది చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి మాళవిక 1979 జూలై 19 వ తేదీన జన్మించారు. తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటించిన మాళవిక ఎంతో గుర్తింపు సంపాదించారు. శ్రీకాంత్ హీరోగా నటించిన చాలా బాగుంది సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది మాళవిక. ఆ తర్వాత 2007లో పారిశ్రామిక వేత్త సురేష్ మీనన్ ను వివాహం చేసుకుని సెటిల్ అయ్యింది  మాలవిక. 

 

 సింధుతులానీ జననం : భారతీయ సినీ నటి అయినా సింధుతులాని 1983 జూలై 19 వ జన్మించారు. మొదట ఫెయిర్ అండ్ లవ్లీ లాంటి పలు వాణిజ్య ప్రకటనల్లో  కనిపించిన సింధు తులాని  2003లో చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన ఐతే  సినిమాతో తన కెరీర్ ను ప్రారంభించింది.  ఇక తన మొదటి సినిమానే  మంచి విజయం సాధించడంతో వరుస అవకాశాలు అందుకుంది.  ముఖ్యంగా తెలంగాణ సాంప్రదాయమైన బతుకమ్మ పండుగను ప్రతిబింబించేలా తెరకెక్కిన బతుకమ్మ సినిమా లో సింధుతులాని నటించి తెలుగు ప్రేక్షకుల అందరికీ మరింత దగ్గరైంది. ఆ తర్వాత నటనకు ఆస్కారమున్న పాత్రలో నటించి మంచి గుర్తింపు సంపాదించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: