హెరాల్డ్ బర్త్ డే : 27-06-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?

praveen

జూన్ 27వ తేదీన ఒక్కసారి చరిత్ర లోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జననాలు  జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో  తెలుసుకుందాం రండి. 

 

 బంకించంద్ర ఛటర్జీ జననం : వందేమాతరం గీత రచయిత అయినా బంకించంద్ర చటర్జీ 1838 జూన్ 27వ తేదీన జన్మించారు. బెంగాలీ కవి వ్యాస రచయిత సంపాదకుడు అయిన బంకించంద్ర చటర్జీ ఎన్నో గీతాలు రాశారు. ముఖ్యంగా ఆయన రాసిన వందేమాతరం గీతం మాత్రం ఆయనకు ఎంతగానో గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈయన  రాసిన వందేమాతరం గీతం భారత స్వతంత్ర సంగ్రామంలో సమరశంఖం గా నిలిచింది.ఆధునిక భారతీయ సాహిత్య చరిత్రలో బంకించంద్ర చటర్జీ అగ్రగణ్యుడు. ఇక బంకిం  చంద్ర చటర్జీ రాసిన ఎన్నో  రచనలు వ్యాసాలు ఎంతగానో ప్రేక్షకాదరణ పొందాయి. 

 


 ముక్కామల అమరేశ్వర రావు : ప్రముఖ రంగస్థల నటులు దర్శకులు నాటక సంస్థ నిర్వాహకుడు అయిన ముక్కామల అమరేశ్వర రావు 1915 జూన్ 27వ తేదీన భద్రాచలం లో జన్మించారు, చదువుకునే రోజుల నుంచి నాటక రంగాలలో ఎంతగానో ఆసక్తి చూపిన ముక్కామల మల్లేశ్వరరావు... విద్యార్థి దశ నుంచే కీలక నాటకాలలో విభిన్న పాత్రల్లో నటిస్తూ ఎంతగానో గుర్తింపు సంపాదించారు, అంతేకాకుండా సినిమా సంగీత దర్శకుడు అయిన తండ్రి వద్ద సంగీతం అభ్యసించారు అమరేశ్వర రావు , నవ్య జ్యోతి ఆర్ట్స్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించి దానిద్వారా ప్రతాపరుద్రీయం వంటి అనేక చారిత్రక పౌరాణిక నాటకాలకు దర్శకత్వం వహించారు. 

 

 రమేష్ నాయుడు జననం : 80వ దశకములో సుప్రసిద్ద తెలుగు సినీ సంగీత దర్శకుడు అయిన రమేష్ నాయుడు 1933 జూన్ 27వ తేదీన జన్మించారు, ముఖ్యంగా ఈయన ఎన్నో సినిమాలకు సంగీతం అందించినప్పటికీ మేఘసందేశం చిత్రంలోని పాటలు సంగీత పరంగా ఎంతగానో ప్రసిద్ధిగాంచాయి అని చెప్పాలి, దాదాపు 100 సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేసి ఎంతగానో గుర్తింపు సంపాదించారు, ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో పురస్కారాలను సైతం అందుకున్నారు రమేష్ నాయుడు. 

 

 సురభి ప్రభావతి జననం  : ప్రముఖ రంగస్థల నటి అయిన సురభి ప్రభావతి 1980 జూన్ 27వ తేదీన జన్మించారు. బాలనటిగా రంగస్థల ప్రవేశం చేసిన ప్రభావతి ఎంతగానో గుర్తింపు సంపాదించారు. 2003లో మదన కామరాజు నాటకం ద్వారా రంగస్థలంపై అడుగుపెట్టిన ప్రభావతి ఇప్పటి వరకు సుమారు 500 నాటికలు నాటకాల్లో  వివిధ పాత్రలు పోషించి నటనతో ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: