హెరాల్డ్ బర్త్ డే : 24-05-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?

praveen

మే 24వ తేదీన ఒక్కసారి చరిత్రలో కి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జననాలు  జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి ఈ రోజు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. 

 

బ్రిటన్ రాణి విక్టోరియా జననం  : బ్రిటన్ రాణి విక్టోరియా 1819 మే  24 వ తేదీన జన్మించారు. ఆమె పూర్తి పేరు విక్టోరియా అలెగ్జాండ్రియా. జ‌వ‌న‌రి 22, 1901లో మ‌ర‌ణించారు. బ్రిట‌న్ రాజ వంశీకురాలు అయిన ఆమె త‌న చివ‌రి 13 సంవ‌త్స‌రాలు కూడా భార‌త గుమ‌స్తా అయిన క‌రీం స‌మ‌క్షంలోనే గ‌డిపారు. అప్ప‌ట్లో ఆమె 70వ ద‌శ‌కంలో ఉండ‌గా.. క‌రీం వ‌య‌స్సు 24 సంవ‌త్స‌రాలు. క‌రీంపై ఆమెకు ఎంతో మంది చెప్పుడు మాట‌లు చెప్పినా కూడా ఆమె చివ‌రి వ‌ర‌కు త‌న‌తో పాటే కొన‌సాగించారు. విక్టోరియా ఆయనకు ఎంత ప్రభావితం అయ్యారంటే, కరీంను తనకు ఉర్దూ నేర్పించమని అడిగారు. దాంతో ఆయన రాణి నోట్‌బుక్‌లో ఉర్దూలో ఒక లైన్ రాసేవారు. తర్వాత దానిని ఇంగ్లిష్‌లో అనువదించి రాసేవారు. మహారాణి విక్టోరియా వాటిని అలాగే తన పుస్తకంలో రాసుకునేవారు. 

 

 ఎల్ వి ఎల్ నరసింహం  జననం : ప్రముఖ న్యాయవాది స్వతంత్ర సమరయోధుడు గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు అయిన ఎల్విఎమ్  నరసింహ 1911 మే 24వ తేదీన గుంటూరు జిల్లాలో జన్మించారు. 1952లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు ఎల్విఎల్ నరసింహం. ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొనని  భారతీయ కమ్యూనిస్టు పార్టీ ఆయనకు మద్దతు ఇచ్చింది. మార్కిస్ట్  సిద్ధాంతాలను పూర్తిగా నమ్మి నరసింహం  కమ్యూనిస్టు పార్టీ లో మాత్రం చేరలేదు. కమ్యూనిస్టు పార్టీలో చేరకుండానే బయటనుండి కమ్యూనిస్టు సిద్ధాంతాలకు పూర్తిగా న్యాయం చేయగలనని నమ్మకంతో స్వతంత్ర అభ్యర్థిగానే ఉన్నారు ఎల్ వి ఎల్ నరసింహం. 1957 లో తిరిగి గుంటూరు నియోజకవర్గం నుంచి లోకసభకు పోటీ చేసినప్పటికీ... కాంగ్రెస్ అభ్యర్థి కొత్త రఘురామయ్య చేతిలో ఓడిపోయారు నరసింహం.  వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఈయన 1936 నుంచి 2004 వరకు న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తూనే ఉన్నారు. 1930లో కృష్ణ సిమెంట్ కంపెనీ యొక్క ట్రేడ్ యూనియన్ కు అధ్యక్షత వహించారు నరసింహం. 1965 నుంచి 1970 వరకు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పని చేశారు. ఇక స్వతంత్ర ఉద్యమంలో రెండు సార్లు జైలుకు కూడా వెళ్ళి వచ్చారు. 

 

 

 పి.జె.శర్మ జననం : పి.జె.శర్మ గా  ప్రసిద్ధులైన పూడిపెద్ది యోగేశ్వర శర్మ ప్రముఖ డబ్బింగు కళాకారుడు. 1933 మే 24వ తేదీన జన్మించారు. తెలుగు రంగస్థలం సినిమా నటుడిగా ఆయనకు ఎంతగానో గుర్తింపు ఉంది. కన్నడ తెలుగు భాషల్లో ఏకంగా 150 కి పైగా సినిమాల్లో నటించి గుర్తింపు సంపాదించారు. ఇక ఏకంగా 500 సినిమాలకు డబ్బింగ్ కళాకారుడిగా కూడా తన గాత్రంతో ప్రముఖ నటులు అందరికీ డబ్బింగ్ చెప్పారు. ఈయనకు ఇద్దరు కుమారులు రవిశంకర్ సాయి కుమార్. ప్రస్తుతం ఈ ఇద్దరు కూడా డబ్బింగ్ కళాకారులుగా కొనసాగుతున్నాయి. ఇక మూడవ తరం కి సాయికుమార్ తనయుడు ఆది కూడా కథానాయకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు. ఈయన 2014 డిసెంబర్ 14వ తేదీన మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: