హెరాల్డ్ బర్త్ డే : 17-05-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?

praveen

మే 17వ తేదీన ఒకసారి చరిత్రలోకి వెళ్లి  చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి ఈరోజు జన్మించిన ప్రముఖులు ఎవరో  తెలుసుకుందాం రండి. 

 

 శ్రీరంగం నారాయణబాబు జననం : ప్రముఖ తెలుగు కవి అయిన శ్రీరంగం నారాయణ బాబు 1906 మే 17వ తేదీన జన్మించారు. నారాయణబాబు పద్యరచనకు భావకవిత్వానికి భిన్నంగా సర్రియనిజం  అనే ప్రక్రియను అనుసరించి రచనలు చేశారు శ్రీరంగం నారాయణ బాబు...యదార్థ  ఘటనలను ఆధారంగా కవితలు రచనలు రాసేవారు. యదార్థ సంఘటనలను కవితలోనూ చిత్రలేఖనంలో చూపించినప్పుడు ఆ విషయం యొక్క మాల స్వరూపాన్ని వివిధ విపరీత పరిస్థితులు వారి నుంచి మరువలేని చిత్రంగా ప్రదర్శించడమే సర్రియలిజం. ఇక ఈయన ఆజన్మ  బ్రహ్మచారిగా పెళ్లికి దూరంగా జీవితం గడిపేశారు. 1961 అక్టోబర్ 2వ తేదీన చెన్నైలో పరమపదించారు శ్రీరంగం నారాయణ బాబు. 

 

 

 శాంతకుమారి జనం :  ప్రముఖ తెలుగు సినిమా నటి  రచయిత దర్శకుడు పి.పుల్లయ్య సతీమణి అయిన శాంతకుమారి 1920 మే 17వ తేదీన జన్మించారు. ఈమె  1936లో శశిరేఖా పరిణయం సినిమాతో నటజీవితం ప్రారంభించి వందకు పైగా సినిమాల్లో నటించి... ఎంతగానో  గుర్తింపు సంపాదించారు. ఇక చిన్నప్పుడు నుంచి కర్ణాటక సంగీతంలో ఉత్తీర్ణులు అయినా శాంతకుమారి పదహారేళ్ళ వయసులోనే స్కూల్ పిల్లలకు సంగీతం నేర్పించేది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించింది శాంతకుమారి. సినిమా జీవితం మొదట్లో అన్ని పురాణాలూ నేపథ్యంలో ఉన్న సినిమాలలో నటించింది. అంతేకాకుండా పలు సోషల్ మెసేజ్ లు ఇచ్చే సినిమాల్లో కూడా నటించింది శాంతకుమారి. ఈమె నటనకు గాను ఎన్నో అవార్డులు రివార్డులను సైతం తలుచుకుంది . 

 

 

 ఛార్మి కౌర్ జననం : ప్రముఖ నటి నిర్మాత అయిన ఛార్మి  కౌర్  తెలుగు ప్రేక్షకులందరికీ కొసమెరుపు. కాగా ఛార్మి కౌర్ 1987 మే 17వ తేదీన జన్మించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా పరిచయమైన ఛార్మి ఎన్నో ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగారు.  తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించింది ఛార్మి. ఎన్నో  ఏళ్ల పాటు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్లు కొనసాగిన ఛార్మి కౌర్ స్టార్ హీరోల సరసన నటించడమే కాదు  లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించింది. తెలుగుతో పాటు కన్నడ మలయాళ సినిమాల్లో కూడా నటించి ఎంతో గుర్తింపు సంపాదించండి. తనదైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించండి ఛార్మి  కౌర్ . ఆ తర్వాత నిర్మాతగా మారి పూరి జగన్నాథ్ తో కలిసి సినిమాలను నిర్మించడం మొదలు పెట్టింది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ తో  ఎన్నో సినిమాలను సైతం నిర్మించింది ఛార్మి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: