హెరాల్డ్ బర్త్ డే : 13-05-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?

praveen

మే 13వ తేదీన ఒకసారి చరిత్ర లోకి వెళ్లి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జననాలు  జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి..

 

 రోనాల్డ్ రాస్ జననం : బ్రిటిష్ వైద్యుడు శాస్త్రవేత్త అయిన రోనాల్డ్ రాస్ 1857 మే 13వ తేదీన జన్మించారు. ఇతనికి మలేరియా పాలిసెట్ జీవిత చక్రం పై  పరిశోధనకు గాను 1902లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు. 1907 లో ఒక దోమ యొక్క జీర్ణశయాంతర ప్రేగు లో  మలేరియా అనే పరాన్న జీవిని కనుగొన్నారు . మలేరియా వ్యాధి దోమల ద్వారా వ్యాపిస్తుంది అని రుజువు చేసిన శాస్త్రవేత్త రోనాల్డ్ రాస్. ఇక ఈ వ్యాధి ఎదుర్కొనే పద్ధతి కి పునాది వేసింది ఈయనే . ఈయన  కేవలం శాస్త్రవేత్త గానే కాదు కవిగా కూడా ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఈయన అనేక కవితలు రాశాడు... అనేక నవలలు కూడా ప్రచురించారు. ఎన్నో పాటలను పాడారు కూడా. గణిత శాస్త్రవేత్తగా కూడా ఎంతో గుర్తింపు పొందారు..వైద్య సేవల్లో  25 సంవత్సరాల పాటు పనిచేశారు రోనాల్డ్ రాస్. 

 

 

 ఫకృద్దీన్  ఆలీ అహ్మద్ జననం : భారతదేశానికి ఐదవ  రాష్ట్రపతిగా సేవలు అందించిన ఫకృద్దీన్ అలీ అహ్మద్ 1905 మే 13వ తేదీన జన్మించారు. 1974 నుంచి 1977 వరకు ఈయన భారత దేశానికి రాష్ట్రపతిగా పని చేశారు. అంతేకాదు అత్యధిక ఆర్డినెన్స్ లు  జారీ చేసిన రాష్ట్రపతి కూడా చరిత్ర సృష్టించారు. స్వాతంత్రోద్యమ కాలంలో కూడా ఎంతో చురుకుగా పాల్గొని... రాష్ట్రపతి అయ్యేంత వరకు కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు. కేంద్రమంత్రిగా వివిధ శాఖలలో  సేవలందించారు . రాష్ట్రపతి పదవిలో ఉన్నప్పుడే ఈయన పరమపదించారు. 

 

 

 వజ్జల  కాళిదాసు జననం : ప్రముఖ కవి అవధాని రచయిత సంపాదకుడు అయిన వజ్జల కాళిదాసు 1909 మే 13వ తేదీన జన్మించారు. విజయనగరం బొబ్బిలి  సమీపంలో జన్మించిన  ఈయన... ఎన్నో  కావ్యాలు రచించారు. 12వ ఏటనే బజ్జీలు వెంకటేశ్వర తో కలిసి వెంకట కాళిదాసు బహుళ   కవిత్వం చెప్పడం ప్రారంభించారు. అంతే కాకుండా ఎన్నో సినిమాలకు స్క్రిప్టు మాటలు పాటలు కూడా రాసి ఎంతగానో గుర్తింపు సంపాదించారు. గీత రచయితగా కూడా ఎన్నో పాటలు రాశారు ఈయన. 

 

 కౌశల్ జననం : మోడల్ గా తన కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత నటుడిగా తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితులుగా  మారిపోయాడు. కౌశల్ 1981 మే 13వ తేదీన జన్మించారు. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ల  నుంచి నటుడిగా కొనసాగుతూ వస్తున్నారు కౌశల్. అయితే ఎన్నో ఏళ్ల  నుంచి చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వస్తున్న కౌశల్   బుల్లితెరపై  సీరియల్స్ లో నటించి గుర్తింపు సంపాదించారు. ఆ తర్వాత తెలుగు బుల్లితెర పై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 2 కంటెస్టెంట్ కి వెళ్ళిన కౌశల్ మరింత మంది అభిమానులను  సంపాదించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: