హెరాల్డ్ బర్త్ డే : 28-04-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?

praveen

 ఏప్రిల్ 28వ తేదీన ఒకసారి చరిత్రలో కి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జననాలు  జరిగాయి.  మరి ఒకసారి చరిత్ర లోకి వెళ్లి ఈరోజు జన్మించిన ప్రముఖులు ఎవరో  తెలుసుకుందాం రండి . 

 


 కాళ్ళకూరి నారాయణరావు జననం : నాటకకర్త సంఘసంస్కర్త ప్రథమాంధ్ర ప్రచురణకర్త జాతీయ వాది అయిన కాళ్లకూరి నారాయణరావు 1891 ఏప్రిల్ 28వ తేదీన జన్మించారు. ఛాయాగ్రహణ వాచా దురంధరుడు, మహాకవి బిరుదాంకితులు ఈయన . తూర్పు గోదావరి జిల్లాలో జన్మించిన ఈయన దురాచారాలను ఎలుగెత్తి ఖండిస్తూ ప్రజ నాటకాలు ఎంతగానో ప్రసిద్ధి చెందినవి. కాళ్ళకూరి నారాయణరావు 1919 లో రాసిన పద్మవ్యూహం నాటకం పద్యాలు సంభాషణలు పొందుపరిచారు. ఆ తర్వాత ఈయన రచించిన ఎన్నో రచనలు ఎక్కువగా ప్రేక్షకాదరణ పొంది ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. 

 

 ఏజీ  కృష్ణమూర్తి జననం  : ముద్రా కమ్యూనికేషన్స్ సంస్థ అధ్యక్షుడు పదవి విరమణ తర్వాత రచయితగా ఆంగ్లంలోనూ తెలుగులోనూ పలు వ్యాసాలు రాసిన వ్యక్తి అయినా కృష్ణమూర్తి 1942 ఏప్రిల్ 28వ తేదీన జన్మించారు. నరోడా లోని రిలయన్స్ సంస్థ ప్రధాన కార్యాలయంలో అడ్వర్టైజింగ్ డైరెక్టర్ గా చేరారు ఏజీ కృష్ణమూర్తి. 

 

 గంటి ప్రసాదం జననం : నక్సలైట్ నాయకుడిగా మారిన కవి గంటి ప్రసాదం 1947 ఏప్రిల్ 28వ తేదీన జన్మించారు. బొబ్బిలి లో జన్మించిన ఆయన 2011 సంవత్సరంలో మావోయిస్టులు ఒడిషా రాష్ట్రంలోని మల్కన్గిరి జిల్లా కలెక్టర్ ను  బందించినప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన ఖైదీలలో ఈయన ఒకరు. నెల్లూరులో 65 సంవత్సరాల వయస్సులో ఆయన హత్యకు గురయ్యారు. శత్రువులు పాశవికంగా ఈయనను కాల్చిచంపారు. 

 


 సమంత జననం : అక్కినేని వారి కోడలు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు తెలియని కాదు. సమంత 1987 ఏప్రిల్ 28వ తేదీన జన్మించారు. కెరీర్ తొలినాళ్లలో మోడలింగ్లో అదరగొట్టిన సమంత ఆ తర్వాత ఏ మాయ చేసావే సినిమాతో 2010లో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఇక ఆ తర్వాత ఈ అమ్మడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస అవకాశాలు దక్కించుకుని ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించింది. దాదాపుగా టాలీవుడ్లోని అందరు హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ఇక ఆ తర్వాత మొదటి సినిమా నుంచి నాగచైతన్య తో ప్రేమాయణం నడిపి ఆ తర్వాత పెళ్లి చేసుకుంది  ఇక పెళ్లి తర్వాత సమంత లైఫ్ మొత్తం మారిపోయింది అనే చెప్పాలి. పెళ్లి తర్వాత నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేసుకుంటూ ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నది  ఈ ముద్దుగుమ్మ. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: