హెరాల్డ్ బర్త్ డే : 04-03-2020 రోజున జన్మించిన ప్రముఖులు వీరే..?

praveen

మార్చి 4వ తేదీన ఒక్కసారి చరిత్ర లోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జన్మించారు. మరి ఒక్కసారి నేడు చరిత్ర లోకి వెళ్లి ఈ రోజు జన్మించిన ప్రముఖులు ఎవరు తెలుసుకుందాం రండి. 

 

 బులుసు సాంబమూర్తి జననం : దేశభక్తుడు స్వాతంత్ర సమరయోధుడు ఆయన బులుసు సాంబమూర్తి 1886 మార్చి 4వ తేదీన జన్మించారు. భారత దేశ స్వాతంత్రం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం విశాలాంధ్ర అనే పరమ లక్ష్యాల సాధనకు నిరంతరం కృషి చేసిన కార్యశూరులు బులుసు సాంబమూర్తి. అంతేకాకుండా ఈయన మద్రాసు శాసన పరిషత్ అధ్యక్షులుగా కూడా పని చేసారు. 

 

 బుర్ర విజయ దుర్గ జననం : ప్రముఖ రంగస్థల నటీమణులు అయినా బుర్ర విజయదుర్గా 1962 మార్చి 4వ తేదీన జన్మించారు. ఈమె  మూడు వేలకు పైగా పౌరాణిక చారిత్రక సాంఘిక నాటక ప్రదర్శనలు ఇచ్చారు. చింతామణి చంద్రమతి బాలనాగమ్మ లక్ష్మీ పద్మావతి పాత్రలతో  బాగా పేరు సంపాదించారు. 

 

 చంద్రశేఖర్ ఏలేటి జననం : ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు అయిన చంద్రశేఖర్ ఏలేటి 1973 మార్చి 4వ తేదీన జన్మించారు. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలను తెరకెక్కించి తెలుగు ప్రేక్షకులను అందించారు. అంతే కాదు తెలుగులో ఉత్తమ జాతీయ చలనచిత్ర పురస్కారం కూడా పొందిన  ఐతే  సినిమా ద్వారా చిత్ర రంగంలోకి ప్రవేశించారు చంద్రశేఖర్ ఏలేటి. అనుకోకుండా ఒక రోజు,  ప్రయాణం వంటి విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించి ప్రత్యేక ఇమేజ్ ను  సంపాదించుకున్నారు. ఆయన తీసిన సినిమాలకు  గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన రెండు నంది పురస్కారాల్ని  కూడా అందుకున్నారు. అప్పటి వరకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన చంద్రశేఖర్ ఏలేటి... ఐతే  సినిమాకు దర్శకత్వ బాధ్యతలను చేపట్టారు. ఈ సినిమా నిర్మాణానికి 1.5 కోట్లు ఖర్చు పెట్టగా..  ఈ సినిమా మొత్తం ఆరు కోట్ల వసూళ్లను రాబట్టింది. రెండు సంవత్సరాల తర్వాత ఈయన అనుకోకుండా ఒక రోజు చిత్రాన్ని విడుదల చేశారు ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇక కొంతకాలం తర్వాత గోపీచంద్ కథానాయకుడిగా ఒక్కడున్నాడు చిత్రానికి దర్శకత్వం వహించారు. 2009 సంవత్సరంలో ఆయన నాలుగో చిత్రం మంచు మనోజ్ కథానాయకుడిగా ప్రయాణం చిత్రానికి దర్శకత్వం వహించారు సినిమా కూడా మంచి విజయం అందుకుంది. 

 

 

 కమలినీ ముఖర్జీ జనం : తెలుగు ప్రేక్షకులందరికీ కమలిని  ముఖేర్జీ  కొసమెరుపు. ఎన్నో సినిమాల్లో కథానాయికగా నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కమలినీ ముఖేర్జీ. ఆనంద్ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన కమలిని ముఖర్జీ... ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. ఇప్పటికి కొన్ని సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు కమలిని ముఖర్జీ. తెలుగుతో పాటు తమిళ కన్నడ భాషల్లో కూడా ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు. నాగార్జున తో శిరిడి సాయిబాబా... మన్యంపులి లాంటి సినిమాల్లో నటించారు కమలినీ ముఖర్జీ. కమలినీ ముఖర్జీ 1980 మార్చి 4వ తేదీన జన్మించారు. 

 

 

 శ్రద్దాదాస్ జననం : ప్రముఖ భారతీయ సినిమా నటి శ్రద్ధాదాస్ 1987 మార్చి 4వ తేదీన జన్మించారు. ఎన్నో బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగు తమిళ భాషల్లో కూడా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శ్రద్ధాదాస్. తెలుగులో సిద్దు ఫ్రం శ్రీకాకుళం అనే సినిమాతో పరిచయమైన ఈ అమ్మడు.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్య 2 సినిమా లో ఓ ముఖ్య పాత్రలో నటించారు. ఆ తర్వాత గుంటూరు టాకీస్ గరుడవేగ సినిమాల్లో నటించారు. ఇక హిందీలో కూడా ఎన్నో సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: