జుట్టురాలు సమస్యలకి "నిమ్మరసం" తో పరిష్కారం

Bhavannarayana Nch

జుట్టుని కాపాడుకోవడానికి అనేకరకాల చిట్కాలు..ఎన్నో పద్దతులు ఉన్నాయి...ఎన్ని అంటే కొన్ని వేల రకాల పద్దతులు మన పూర్వీకులు తెలుసుకుని ఉన్నారు..వాటిలో కొన్ని విషయాలు మనకి అనేక మంది ఆయుర్వేద పరిశోధకుల వల్ల తెలుస్తున్నాయి.జుట్టురాలే..దృఢంగా ఉండే వాటికోసం మనం వాడే పద్దతుల్లో ముఖ్యమైనది నిమ్మరసం. నిమ్మరసాన్ని ఆరోగ్య హితానికే కాకుండా అనేక రకాలుగా కూడా ఉపయోగించవచ్చు. చుండ్రు పోవడానికి,జుట్టు రాలకుండా ఉండటానికి ఇది ఇంతగానో ఉపయోగపడుతుంది.

 

మార్కెట్లో దొరికే అనేకరకాల షాంపూలు జుట్ట సంరక్షణ జేల్లిస్ లో నిమ్మరసం వినియోగిస్తారు కూడా.. నిమ్మరసంలో ఉండే విటమిన్ “సి “ మరియు యాంటీఆక్సిడెంట్ జుట్టును బలంగా చేయడంలో ఎంతో సహకరిస్తాయి. నిమ్మరసం జుట్టులోపల ఉండే రూట్స్ ని ఎలావృద్ది చేసి జుట్టుని బలంగా చేస్తుందో కొన్ని కొన్ని పద్దతులు పాటించడం వలన తెలుస్తుంది.

 

ముందుగా ఒక స్పూన్ నిమ్మరసం తీసుకుని దానిలో రెండు స్పూన్స్ ఆలివ్ నునే కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకి ముఖ్యంగా తలలోపల చర్మానికి బాగా పట్టించి మర్దనా చేయాలి. సుమారు 30 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి ఇలా  చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్యకి మీరు చెక్ పెట్టినట్లే.

 

అంతేకాదు నాలుగు వెల్లులి రేకుల్ని తీసుకుని వాటిని మెత్తగా దంచి..దానిలో మూడు స్పూన్స్ కొబ్బరి నునే కలిపి అందులో రెండు స్పూన్స్ నిమ్మరసం కలపాలి..ఈ మిశ్రమాన్ని తలకి పట్టించిన తరువాత ఒక రోజు మొత్తం ఉంచుకుని మరుసటి రోజు గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.ఇలా వారానికి ఒక సారి చేస్తూ ఉంటే మీ జుట్టు రాలే సమస్య వెంటనే తగ్గుతుంది.

 





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: