దీన్ని అప్లై చేయడం వల్ల ముఖం ఎంత అందంగా మారుతుందో తెలుసా?

Purushottham Vinay

అందంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు?  అందమైన, మచ్చలు లేని, మెరిసే ముఖం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఖరీదైన క్రీములు, బ్యూటీ ట్రీట్మెంట్లు, వివిధ రకాల ఫేషియల్స్ ఇలా ఎన్నో  ప్రయత్నాలు చేసేవారు ఎంతో మంది.అన్ని చేసిన కూడా గులాబీ రంగు మెరుపు చెంపల పై రావడం కష్టమే. రసాయనాలు నిండినఫేస్ క్రీములు రాయడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. వాటి ఖరీదు కూడా ఎక్కువే. కాబట్టి అలాంటి క్రీముల కోసం డబ్బు ఖర్చు చేయడం వేస్టు తప్ప లాభం ఏం లేదు. అవి మన చర్మానికి కూడా  చాలా ప్రమాదకరం. కాబట్టి నాచురల్ గా మీరు ఇంట్లోనే గులాబీ పువ్వులతో చేసే రోజ్ జెల్ తయారీని చేసుకోండి మరి ఇలా ఇంట్లోనే. ఇది మీ ముఖానికి మంచి గులాబీ వర్ణం మెరుపును అందిస్తుంది. దీనిని తయారు చేయడం చాలా సులువు. రోజ్ జెల్ తయారీకి ఈ మ్యాజికల్ రోజ్ జెల్ తయారు చేసుకుని ముఖానికి ప్రతిరోజూ అప్లై చేస్తే మీ చర్మం కొన్ని రోజులకే మెరిసిపోతుంది. మీకు గులాబీ రేకులు దొరికితే ఆ రేకులను వినియోగించుకోవచ్చు. మీకు తాజా గులాబీ రేకులు లేకపోతే, మార్కెట్లో లభించే రోజ్ పౌడర్‌ను కూడా ఉపయోగించవచ్చు. తాజా గులాబీ రేకులను శుభ్రంగా కడిగి వాటిని మిక్సీలో వేయాలి. 


రోజ్ వాటర్ కూడా మెత్తగా రుబ్బుకోవాలి. వాటిని గట్టిగా వడకట్టి రసాన్ని వేరు చేయాలి. ఇప్పుడు ఈ జ్యూస్ లో కొద్దిగా అలోవెరా జెల్, విటమిన్ ఇ క్యాప్సూల్స్ కలపాలి. అంతే ఇంకా చర్మాన్ని మెరిసేలా చేసే రోజ్ జెల్ రెడీ అయిపోతుంది.  దీనిని ప్రతి రాత్రి అయిన ఏ సమయం లో అయిన ఈ జెల్ ను మీరు ఎప్పుడైనా అప్లై చేయవచ్చు, రాత్రిపూట అప్లై చేయడం మరింత ప్రభావవంతంగా ఉంటుంది. రాత్రిపూట ఫేస్ వాష్ చేసుకున్నాక ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు రోజూ కొద్దిగా జెల్ తీసుకుని ముఖానికి బాగా మసాజ్ లాగ చేయాలి. ఈ జెల్ రాత్రిపూట మీ ముఖాన్ని మెరుగుపరచడానికి పని చేస్తుంది. ప్రతిరోజూ పడుకునే ముందు ఈ జెల్ తో మసాజ్ చేయడం మర్చిపోవద్దు. కొద్ది రోజుల్లోనే ముఖంపై ఉన్న మరకలు, మొటిమలు మాయమై ముఖం గులాబీ రంగులో మెరిసిపోతుంది.ఈ రోజ్ జెల్ అప్లై చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో వాడినవి అన్ని పదార్థాలు సహజసిద్ధమైన వస్తువులే. దీన్ని ఇంట్లోనే తయారు చేశారు కాబట్టి పూర్తి గా రసాయన రహితంగా ఉంటుంది. గులాబీలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇది ముఖాన్ని కాంతివంతం, మెరిసే విధంగా చేయడానికి పనిచేస్తుంది. దీంతో పాటు రంధ్రాలు, మరకలు తెరుచుకునే సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కలబంద, విటమిన్ ఇ కూడా ముఖాన్ని మెరుగుపరచడానికి పనిచేస్తాయి. కొన్ని రోజులు ఈ జెల్ వాడిన తర్వాత ముఖం గులాబీ రంగులో మెరిసిపోవడం ఖాయం. ఒక్కసారి ఈ రోజ్ జెల్ తయారు చేసుకుంటే నెల రోజుల పాటూ వాడుకోవచ్చు. రసాయనాలతో నిండిన క్రీములు వాడే కన్నా ఈ జెల్ వాడుకుంటే ఎంతో మంచిది. దీన్ని ప్రతి రోజు వాడడం  ప్రారంభించాక కేవలం నెల రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: