ఇలా చేస్తే ముఖ సౌందర్యం రెట్టింపవుతుంది?

Purushottham Vinay
ముఖ సౌందర్యం కోసం మనం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయితే ముఖ సౌందర్యం కోసం మనం బాదంపప్పును ఉపయోగిస్తే మన చర్మాన్ని మృదువుగా మరియు అందంగా మార్చుకోవచ్చు.బాదంపప్పును రాత్రంతా కూడా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు దీన్ని గ్రైండ్ చేసి పెరుగుతో కలిపి శుభ్రమైన ముఖానికి బాగా పట్టించి, ఒక 15 నిమిషాల తర్వాత శుభ్రమైన నీటితో ముఖాన్ని శుభ్రంగా కడగాలి. మీ చర్మం పొడిగా లేదా గరుకుగా ఉంటే, మీరు బాదం ఇంకా ఓట్ ఫేస్ ప్యాక్‌ని మీ ముఖానికి రాసుకోవచ్చు. దీన్ని చేయడానికి, మీరు బాదంపప్పును రాత్రంతా కూడా ఉంచాలి. నానబెట్టిన బాదంపప్పును గ్రైండ్ చేసి సన్నని పేస్ట్ లాగా చేసి, అందులో పాలు, ఓట్స్ వేసి ఫేస్ మాస్క్ రెడీ చేసుకోవాలి. ఈ ఫేస్ మాస్క్‌ని మీ ముఖంపై 15 నుండి 20 నిమిషాల పాటు అప్లై చేసి తర్వాత శుభ్రంగా కడిగేయండి. ఇలా చేయడం వల్ల చర్మం మెరిసిపోయి డెడ్ స్కిన్ అనేది చాలా ఈజీగా తొలగిపోతుంది.


మీరు బాదంపప్పును ఉపయోగించే ముందు ఖచ్చితంగా ప్యాచ్ టెస్ట్ చేయించుకోండి, ఎందుకంటే కొంతమందికి అలర్జీ అనేది ఉండవచ్చు, ఇది కనుక జరిగితే, బాదం వాడటం మానేసి, ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి.బాదంపప్పును మెత్తగా గ్రైండ్ చేసి, పౌడర్‌గా చేసి, ఈ పొడిలో పాలు లేదా రోజ్ వాటర్ వేసి పేస్ట్ చేయండి. ఈ పేస్ట్‌ను మీ ముఖంపై ఒక 15 నుండి 20 నిమిషాల పాటు అప్లై చేసి, ఆపై చల్లటి నీటితో బాగా శుభ్రం చేసుకోండి. ఇంకా ఇది మాత్రమే కాదు, మీరు బాదంపప్పులను తినవచ్చు, మీరు మూడు నుండి నాలుగు బాదంలను రాత్రిపూట పాలలో నానబెట్టుకొని తినాలి. ఉదయం పూట నిద్ర లేవగానే పాలలోని బాదంపప్పును తీసి తిని ఆ పాలు తాగాలి. కావాలంటే బాదం పాలను కూడా మీరు తయారు చేసుకుని తాగవచ్చు. ఇందుకోసం బాదంపప్పును మిక్సీలో గ్రైండ్ చేసి, పాలతో కలిపి గ్యాస్‌పై కాసేపు మరిగించాలి. మీరు బాదం ఇంకా పెరుగుతో ఫేస్ ప్యాక్ కూడా తయారు చేసుకోవచ్చు. జిడ్డు చర్మం ఉన్నవారికి ఇది చాలా చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: