ఇలా చేస్తే అదిరే అందం మీ సొంతం?

Purushottham Vinay
నెయ్యి వేసుకుని అన్నం తింటే వచ్చే ఆ రుచే వేరు. అయితే చలికాలంలో  నెయ్యి తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అంతేగాక ఈ సీజన్‌లో చర్మానికి నెయ్యి అప్లై చేయడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు పొందొచ్చు.ఇందులో యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. వారానికి ఒకసారి నెయ్యి ఫేస్ ప్యాక్ ఉపయోగించవచ్చు. శెనగపిండి, పసుపులో నెయ్యి కలిపి చర్మానికి 20 నిమిషాలు పట్టిస్తే ప్రకాశవంతంగా మారుతుంది.ఈ కాలంలో తప్పనిసరిగా బాడీ లోషన్ వాడాలి. షియా బటర్ లేదా కోకో బటర్‌తో నెయ్యి కలుపుకుని చేతులు, కాళ్ళ ఉపయోగించవచ్చు. అలాగే చలికాలంలో మడమల పగుళ్లు చాలా సాధారణం. అయితే రోజూ నిద్రపోయే ముందు మడమలకు నెయ్యి రాసుకుంటే పాదాల పగుళ్ల సమస్యను సులభంగా తగ్గించుకోవచ్చు.ఇక నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు ఇంకా మినరల్స్ ఉంటాయి. ఇవి చర్మానికి మేలు చేస్తాయి. నెయ్యి, తేనె కలిపి చర్మంపై వృత్తాకారంలో మసాజ్ చేసుకోవాలి. ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ముఖం కడుక్కోవాలి.



ఇలా చేయడం వల్ల చర్మంపై వృద్ధాప్య సంకేతాలను ఈజీగా దూరం చేసుకోవచ్చు.అలాగే మన పెదాలను ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి నెయ్యిని ఉపయోగించవచ్చు. నెయ్యి, తేనె, పంచదార సమాన పరిమాణంలో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదవులపై అప్లై చేసుకొని వృత్తాకారంలో మసాజ్ చేయాలి. ఈ లిప్ స్క్రబ్ పెదవులపై ఉన్న మృతకణాలన్నిటినీ తొలగించి, పెదవుల గులాబీ రంగును తిరిగి తెస్తుంది.కొబ్బరి నూనె లేదా బాదం నూనెతో నెయ్యి మిక్స్ చేసి రెండు చేతులకు అప్లై చేయాలి. ఇది చేతుల చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. నెయ్యిని చేతులతో పాటు ముఖానికి మాయిశ్చరైజర్‌గా ఉపయోగించవచ్చు. తక్కువ మంట మీద నెయ్యి వేడి చేసి, ఆ తర్వాత అందులో అలోవెరా జెల్‌ను మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల పాటు అలాగే ఉంచి తడి టవల్‌తో ముఖాన్ని తుడుచుకోవాలి. ఈ టిప్ పొడి చర్మానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: