నెయ్యితో ఇలా చేస్తే అంతులేని అందం మీ సొంతం?

Purushottham Vinay
నెయ్యిని వాడడం వల్ల ఖచ్చితంగా చాలా అందంగా మెరిసిపోతారు. నెయ్యిని సరైన విధంగా ఉపయోగించుకుంటే ఆరోగ్యంతో పాటు చర్మానికి కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇక ఒక గిన్నెలో 3 టీ స్పూన్ల కరిగించిన నెయ్యిని తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో 3 టీ స్పూన్ల కొబ్బరి నూనె లేదా బాదం నూనె వేసి బాగా కలపాలి. ఆ తరువాత దీనిని గాజు సీసాలో నిల్వ చేసుకుని ఉపయోగించాలి. ఇలా తయారు చేసుకున్న నెయ్యిని చర్మానికి రాసుకోవడం వల్ల చర్మం చాలా సమయం దాకా పొడిబారకుండా ఉంటుంది. ఇంకా అలాగే మన పెదవులు అందంగా, పొడిబారకుండా ఉండడానికి లిప్ బామ్ లను ఎక్కువగా వాడుతూ ఉంటాము.అయితే వీటికి బదులుగా నెయ్యిని వాడడం వల్ల పెదవులు అందంగా, పొడిబారకుండా  ఇంకా పగలకుండా ఉంటాయి. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు 2 లేదా 3 చుక్కల నెయ్యిని పెదవులపై రాసి సున్నితంగా మర్దనా చేసుకోవాలి. ఇక ఇలా చేయడం వల్ల పగిలిన పెదవులకు తగినంత తేమ లభించి తిరిగి సాధారణ స్థితికి వస్తాయి. ఇంకా అలాగే పెదవులు చక్కటి రంగుతో అందంగా మెరుస్తాయి.


అలాగే చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను కూడా ఈజీగా తొలగించుకోవడానికి మనం బాడీ స్క్రబ్ లను వాడుతూ ఉంటాము. అయితే ఇలా బయట లభించే వాటిని వాడడానికి బదులుగా నెయ్యితో మనం చక్కటి స్క్రబర్ ను తయారు చేసుకొని వాడవచ్చు.అయితే మీరు దీనికోసం ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల కరిగించిన నెయ్యి, రెండు టీ స్పూన్ల కొబ్బరి పాలు, ఒక టీ స్పూన్ పంచదార ఇంకా అలాగే ఒక టీ స్పూన్ శనగపిండి వేసి బాగా కలపాలి.ఆ తరువాత దీనిని చర్మానికి రాసుకుని స్క్రబ్ చేసిన తరువాత శుభ్రంగా స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై పేరుకుపోయిన దుమ్ము. ధూళి ఇంకా మృతకణాలు తొలిగిపోవడంతో పాటు చర్మ ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది. ఇంకా అలాగే నెయ్యిలో శనగపిండి వేసి బాగా కలపాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరిన తరువాత కడిగి వేయాలి. ఇలా నెయ్యితో ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకుని వాడడం వల్ల ముఖం చాలా అందంగా తయారవుతుంది. ఈ విధంగా నెయ్యిని ఉపయోగించడం వల్ల ముఖం చాలా అందంగా ఇంకా కాంతివంతంగా కనబడడంతో పాటు చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: