ముఖం అందంగా మెరిసిపోవాలంటే ఇలా చెయ్యండి?

Purushottham Vinay
ముఖం నిత్యం అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. అందుకోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇంకా ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు.ఇంకా ఎన్నో ఖరీదైన సౌందర్య ఉత్పత్తులను వాడుతూ ఉంటారు.అయితే వీటిని వాడడం వల్ల అందంగా కనిపించినప్పటికి వీటిని దీర్ఘకాలం పాటు వాడడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. అయితే ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా చాలా తక్కువ సమయంలోనే మనం మన ముఖాన్ని చాలా అందంగా మార్చుకోవచ్చు. ముఖాన్ని అందంగా మార్చడంలో ముల్తానీ మట్టి మనకు బాగా సహాయపడుతుంది. చాలా కాలంగా ముల్తానీ మట్టిని సౌందర్య సాధనంగా ఉపయోగిస్తున్నారు.ఆయుర్వేదంలో దీన్ని అందాన్ని మెరుగుపరచడంలో  విరివిరిగా ఉపయోగిస్తారు.ముల్తానీ మట్టిని ఉపయోగించడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. దీనిని ఉపయోగించడం వల్ల చాలా తక్కువ సమయంలోనే మనం మన ముఖాన్ని చాలా అందంగా మార్చుకోవచ్చు. ముల్తానీ మట్టితో ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకుని వాడడం వల్ల మనం మన ముఖాన్ని చాలా అందంగా మార్చుకోవచ్చు. ఇక ఈ ఫేస్ ప్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలి…ఎలా వాడాలి..వంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఈ ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకోవడానికి  ముందుగా ఒక గిన్నెలో ఒకటేబుల్ స్పూన్ ముల్తానీ మట్టిని తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో రెండు టీ స్పూన్ల రోజ్ వాటర్ ను ఇంకా ఒక టీ స్పూన్ తేనెను వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ తరువాత దీనిని ముఖానికి ప్యాక్ లాగా వేసుకోవాలి.అలాగే దీనిని పూర్తిగా ఆరిన తరువాత సాధారణ నీటితో ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల ముఖం బాగా శుభ్రపడుతుంది.అలాగే ముఖంపై ఉండే మొటిమలు కూడా తగ్గుముఖం పడతాయి. వేసవి కాలంలో ఇలా ముల్తానీ మట్టితో పేస్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల ముఖం బాగా కూల్ అవుతుంది. ఎండ వల్ల చర్మం కందిపోకుండా ఇంకా నల్లబడకుండా ఉంటుంది.అలాగే ముల్తానీ మట్టిలో తేనె వేసుకుని ముఖానికి రాసుకోవడం వల్ల ఎండ వల్ల కందిపోయిన చర్మం తిరిగి సాధారణ స్థితికి వస్తుంది. ముఖం ఎల్లప్పుడూ చాలా కాంతివంతంగా తయారవుతుంది. అలాగే చర్మం పొడిబారకుండా కూడా ఉంటుంది. చర్మం చాలా మృదువుగా అవుతుంది. ఈ విధంగా ముల్తానీ మట్టి చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో బాగా సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: