పెదాలు అందంగా కనిపించాలంటే ఇలా చేయండి..!!
స్క్రబ్స్ వాడటం..
పొడిబారిన పెదాలు ముందుగా స్క్రబ్స్ వాడి శుభ్రం చేసుకోవాలి. చక్కెర మరియు బీట్రూట్ వంటివి పెదాలకు స్క్రబ్ లాగా ఉపయోగపడతాయి. ఈ స్క్రబ్స్ తో పెదవులను శుభ్రం చేసుకున్న తర్వాత,నాచురల్ మాయిశ్చరైజర్ రాయడం వల్ల పెదవులు తేమగా ఉంటాయి.
తేనే..
పెదవులకు తేనె మంచి మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది.పెదవులు పొడిబారినట్టు అనిపించినప్పుడు, చిటికెడు తేన రాస్తే సరి. పెదవులపై పొక్కులు మృతకణాలు తొలగిపోతాయి. పెదవులు ఎక్కువసేపు తేమగా ఉండాలి అంటే రాత్రి పడుకోబోయే ముందు తరచూ పోయడం వల్ల,తేమను కోల్పోవు.
గ్రీన్ టీ..
గ్రీన్ టీ బ్యాగులను పెదవులపై మర్దన చేయడం వల్ల, పెదవులు పెదవులు పొడిబారడం,పగుళ్ళు వంటివి తొందరగా తగ్గిపోతాయి.
విటమిన్ b12..
విటమిన్ బి12 అత్యధికంగా ఉన్న చేపలు, తృణ ధాన్యాలు వంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల,పెదవులు ఆరోగ్యం కాపాడు కోవచ్చు.ఇది పెదవుల్ని తేమగా ఉంచడానికి ఎంతో బాగా సహాయపడతాయి.
వెన్న..
వెన్న పెదవులకు మంచి టోనర్ గా ఉపయోగ పడుతుంది.రాత్రి పడుకోబోయే ముందు లిప్స్టిక్ ని బాగా శుభ్రం చేసి,వెన్న రాసి పడుకోవడం వల్ల,పెదవులు తేమని కోల్పోవు.
కలబంద..
తరచూ పెదవులకు కలబంద గుజ్జు అప్లై చేయడం వల్ల ఇందు లోని విటమిన్ ఈ పెదవులను తేమను కోల్పోకుండా చేస్తాయి. మరియు ఇది మాయిశ్చరైజర్ గా కూడా పనిచేస్తుంది. లిప్స్టిక్ శుభ్రం చేసిన తర్వాత కలబంద గుజ్జు అప్లై చేయడం చాలా ఉత్తమం.
నీరు..
అన్నిటి కన్నా ముందు నీరుని ఎక్కువ గా తీసుకోవడం వల్ల పెదవుల్ని డి హైడ్రెట్ కాకుండా కాపాడు కోవచ్చు. రోజు కనీసం నాలుగు లీటర్లు నీళ్లు తాగడం చాలా ఉత్తమం.