వక్షోజాల సైజ్ ని పెంచే టిప్?

Purushottham Vinay
వక్షోజాల సైజ్ చిన్నగా ఉందని చాలా మంది స్త్రీలు బాధ పడుతూ వుంటారు. ఐతే అలా బాధపడే స్త్రీలు ఒక చక్కటి టిప్ ని పాటించడం వల్ల చాలా సులభంగా వక్షోజాల సైజుని పెంచుకోవచ్చు. అలాగే ఈ టిప్ ని పాటించడం వల్ల వక్షోజాలు బిగుతుగా కూడా మారతాయి. వక్షోజాల పరిమాణాన్ని పెంచే ఈ టిప్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి  మనం 4 టీ స్పూన్ల ఆవ నూనెను, ఒక టీ స్పూన్ మెంతులను ఇంకా అలాగే ఒక టీ స్పూన్ పటిక పొడిని వాడాల్సి ఉంటుంది. ఇక పటిక అనగానే చాలా మంది పటిక బెల్లం అనుకుంటారు. కానీ పటిక ఇంకా పటిక బెల్లం వేరుగా ఉంటాయి.  ఈ టిప్ తయారు చేసుకోవడానికి  ముందుగా ఒక గిన్నెలో ఆవ నూనెను వేసి వేడి చేయాలి.ఆ నూనె వేడయ్యాక మెంతులను వేసి వాటిని వేయించాలి. మెంతులు బ్రౌన్ కలర్ లోకి వచ్చే దాకా వేయించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని 7 నుండి 8 గంటల పాటు అలాగే ఉంచాలి. ఇక ఇలా 8 గంటల పాటు ఉంచిన తరువాత ఈ నూనెను వడకట్టుకుని తీసుకోవాలి.


 ఆ తరువాత ఈ నూనెలో ఒక టీ స్పూన్ పటిక పొడిని వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు వక్షోజాలకు రాసుకోవాలి.వక్షోజాలపై నెమ్మదిగా ఒత్తిడిని కలిగించకుండా వక్షోజాలను పైకి అనుకుంటూ అప్లై చేసుకోవాలి. ఇలా 10 నిమిషాల పాటు నూనెను రాసుకున్న తరువాత బిగుతుగా ఉండేలా బ్రాను వేసుకుని నిద్రపోవాలి. ఆ తరువాత ఉదయాన్నే వక్షోజాలను నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా ఒక 15 నుండి నెల రోజుల పాటు చేయడం వల్ల వక్షోజాలు పెద్దగా ఇంకా బిగుతుగా తయారవుతాయి. అలాగే మెంతులను పేస్ట్ గా చేసి రాసుకున్నా లేదా మెంతుల నీటిని తాగినా కూడా ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది. ఈ టిప్ ని పాటించడంతో పాటు బాదంపప్పు, వాల్ నట్స్ వంటి వాటిని ఎక్కువగా తినాలి. ఇంకా అలాగే సోయా పదార్థాలను కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఈ విధంగా ఈ టిప్ ని వాడడం వల్ల చాలా సులభంగా వక్షోజాల సైజుని పెంచుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: