ఈ క్రీం రాస్తే మచ్చలు మొటిమలు మాయం?

Purushottham Vinay
ఇక మొటిమల కారణంగా ముఖం చాలా అంద విహీనంగా కనబడడంతో పాటు తీవ్రమైన నొప్పి, బాధ కూడా ఎక్కువగా కలుగుతుంది. మొటిమలను తగ్గించుకోవడానికి రకరకాల ఫేస్ వాష్ లను ఇంకా అలాగే లేపనాలను కూడా వాడుతూ ఉంటారు. అయితే ఎలాంటి ఖర్చు లేకుండా కేవలం మన ఇంట్లో ఉండే పదార్థాలతో మనం మొటిమలను చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు.అయితే ఈ చిట్కాతో మొటిమల్ని ఈజీగా పోగొట్టుకోవచ్చు. దీన్ని తయారు చేసుకోవడానికి  మనం కొబ్బరి నూనెను ఇంకా అలాగే కర్పూరాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. కర్పూరంలో ఉండే ఔషధ గుణాలు ఇన్ ప్లామేషన్ ఈజీగా తగ్గించి మొటిమలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి. ఈ టిప్ వల్ల మొటిమల వల్ల కలిగే నొప్పి కూడా చాలా ఈజీగా తగ్గుతుంది. ఇంకా అలాగే మొటిమల తాలూకు నల్ల మచ్చలు కూడా ఈజీగా తగ్గుతాయి. ఇంకా ఈ టిప్  వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. దీనిని తయారు చేయడం కూడా చాలా ఈజీ. దీని కోసం ముందుగా ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల కొబ్బరి నూనెను మీరు తీసుకోవాలి.


ఇక ఆ తరువాత ఇందులో 4 కర్పూరం బిళ్లను పొడిగా చేసి వేసుకోవాలి. తరువాత నూనెలో కర్పూరం కరిగే దాకా బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని వాడే ముందు ముఖాన్ని గోరు వెచ్చని నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. తరువాత ముఖాన్ని నీట్ గా తుడుచుకోవాలి. తరువాత ఈ మిశ్రమంలో దూదిని ముంచి మొటిమలపై ఇంకా నల్ల మచ్చలపై రాసుకోవాలి. తరువాత ఇలా రెండు మూడు సార్లు రాసుకున్న తరువాత 15 నుండి 20 నిమిషాల పాటు దీనిని బాగా ఆరనివ్వాలి. ఈ మిశ్రమం పూర్తిగా ఆరిన తరువాత సబ్బు ఉపయోగించకుండా నీటితో ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడు సార్లు చేయడం వల్ల మొటిమల సమస్య క్రమంగా చాలా ఈజీగా తగ్గు ముఖం పడుతుంది. అలాగే ముఖం పై ఉండే మచ్చలు కూడా ఈజీగా తొలగిపోయి ముఖం చాలా అందంగా మారుతుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్ ని పాటించండి. మచ్చలు అలాగే మొటిమలు లేని అందమైన ముఖాన్ని సొంతం చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: