పాదాల పగుళ్లని పోగొట్టే సూపర్ టిప్?

Purushottham Vinay
పాదాల పగుళ్లకి చాలా కారణాలు ఉంటాయి. పాదాలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, పాదాలపై మృత కణాలు పేరుకుపోవడం ఇంకా శరీరం డీ హైడ్రేషన్ కు గురి కావడం, శరీరంలో వేడి ఎక్కువగా ఉండడం, ఊబకాయం, షుగర్, హైపో థైరాయిడిజం, ఎత్తుగా ఉండే చెప్పులను ధరించడం ఇంకా అలాగే పాదాల దగ్గర చర్మం పొడిబారడం వంటి వివిధ కారణాల వల్ల పాదాల పగుళ్లు వస్తాయి. పాదాల పగుళ్ల కారణంగా నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. వీటి కారణంగా చాలా మంది నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే పగుళ్లు ఖచ్చితంగా తీవ్రమై పగుళ్ల నుండి రక్తం కారే అవకాశం కూడా ఉంటుంది.అయితే ఒక సూపర్ టిప్ ని ఉపయోగించి మనం చాలా సులభంగా పాదాల పగుళ్లను నివారించుకోవచ్చు. ఈ టిప్ ని తయారు చేసుకోవడం అలాగే వాడడం కూడా చాలా సులభం. ఈ టిప్ ని క్రమం తప్పకుండా పాటించడం వల్ల మనం ఖచ్చితంగా పాదాల పగుళ్లను చాలా సులభంగా నివారించుకోవచ్చు. పాదాల పగుళ్లను తగ్గించే ఆ టిప్ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ టిప్ తయారు చేసుకోవడానికి  మనం ఒక క్యాండిల్ ను, రెండు టీ స్పూన్ల ఆవ నూనెను ఇంకా అలాగే రెండు విటమిన్ ఇ క్యాప్సుల్స్ ను ఉపయోగించాల్సి ఉంటుంది.


ముందుగా ఒక క్యాండిల్ ను తీసుకుని రెండు ఇంచుల పరిమాణంలో దాన్ని కట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.ఆ తరువాత ఆందులో ఆవనూనెను ఇంకా విటమిన్ ఇ క్యాప్సుల్స్ ను వేసుకోవాలి.తరువాత ఈ గిన్నెను స్టవ్ మీద ఉంచి క్యాండిల్ కరిగే దాకా బాగా వేడి చేయాలి. ఈ మిశ్రమం కొద్దిగా చల్లారిన తరువాత పాదాల పగుళ్లపై దాన్ని రాసుకోవాలి. దీనిని రాత్రి పడుకునే ముందు రాసుకుని పొద్దున పూట కడిగి వేయాలి. అయితే ఈ టిప్ ని వాడే ముందు పాదాలను ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. ఉప్పు వేసిన గోరు వెచ్చని నీటిలో పాదాలను ఒక పది నిమిషాల పాటు ఉంచాలి. ఆ తరువాత పాదాలపై ఉండే మురికి, మృతకణాలు పోయేలా బాగా శుభ్రం చేసుకుని ఆ తరువాత ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసుకోవాలి. ఇలా ఈ టిప్ ని క్రమం తప్పకుండా వాడడం వల్ల చాలా సులభంగా పాదాల పగుళ్లను మనం తగ్గించుకోవచ్చు. పాదాల పగుళ్లతో ఇబ్బంది పడే వారు ఈ టిప్ పాటించడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: