టమాటాతో ఇలా చేస్తే సూపర్ బ్యూటీ మీ సొంతం?

Purushottham Vinay
బయట నుంచి వచ్చే గాలిలో ఉండే దుమ్ము, ధూళి మన ముఖంపై పేరుకుపోవడం వల్ల ముఖం నల్లగా మారడం, మొటిమలు, చర్మంపై మృత కణాలు పేరుకుపోవడం, బ్లాక్ హెడ్స్ ఇంకా అలాగే ఎండ వల్ల ముఖం నల్లగా మారడం వంటి వివిధ రకాల చర్మ సమస్యలతో బాధపడే వారు ఈ కాలంలో చాలా ఎక్కువవుతున్నారు.అయితే మన వంటింట్లో కూరకు ఉపయోగించే టమాటాతో ముఖాన్ని అందంగా ఇంకా కాంతివంతంగా మార్చుకోవచ్చు.ఇక దీని కోసం ముందుగా ఒక టమాటాను తీసుకోని తరువాత దానిని సగానికి కట్ చేయాలి. ఆ తరువాత సగం ముక్క టమాటను తీసుకుని దానికి పంచదారను అద్దాలి.ఇలా పంచదార అద్దిన టమాట ముక్కను తీసుకుని ముఖంపై కాసేపు రుద్దుకోవాలి. ఇలా ఒక పది నిమిషాల పాటు సున్నితంగా రుద్దుకుని ఆ తరువాత ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత మిగిలిన టమాట ముక్కను పేస్ట్ లాగా చేసుకోవాలి.తరువాత దానిలో రెండు టీ స్పూన్ల పాలను బాగా కలిపి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. అది ఆరిన తరువాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.


టమాటను ఇంకా పంచదారను కలిపి రాసుకోవడం వల్ల అది స్క్రబర్ లా పని చేస్తుంది. దీంతో ముఖం మీద పేరుకుపోయిన మృతకణాలు, దుమ్ము, ధూళి ఇంకా అలాగే మురికి చాలా ఈజీగా తొలగిపోతుంది.ఇంకా అలాగే పాలు, టమాట పేస్ట్ కలిపి రాసుకోవడం వల్ల చర్మానికి కావల్సిన పోషకాలు అలాగే తేమ కూడా అందుతాయి. అలాగే చర్మంలో ఉండే ఇన్ ప్లామేషన్ తగ్గి మొటిమలు కూడా చాలా ఈజీగా తగ్గుతాయి. ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల మొటిముల, మచ్చలు ఇంకా అలాగే నలుపుదనం లేని అందమైన, కాంతివంతమైన ముఖాన్ని మీరు ఈజీగా సొంతం చేసుకోవచ్చు. అలాగే ఈ టిప్ తయారీలో ఉపయోగించిన ప్రతి పదార్థం కూడా మనకు సులభంగా లభించేదే. అలాగే ఇవి చాలా సహజ సిద్దమైనవే. ఇక ఈ టిప్ ని పాటించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. చాలా సులభంగా మనం అందమైన ముఖాన్ని ఈజీగా సొంతం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: