జుట్టును అందంగా, ఒత్తుగా, ధృడంగా మార్చే టిప్?

Purushottham Vinay
మన జుట్టును అందంగా, ఒత్తుగా, ధృడంగా మార్చే ఓ అదిరిపోయే సూపర్ టిప్ ఉంది. ఖచ్చితంగా ఆ టిప్ పాటించడం వల్ల మనం చాలా ఈజీగా జుట్టు రాలే సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.ఈ టిప్ తయారు చేసుకోవడానికి  మనం ఒక తమలపాకును, 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక టీ స్పూన్ మెంతులు ఇంకా పావు లీటర్ కొబ్బరి నూనెను వాడాల్సి ఉంటుంది.ముందుగా మీరు ఒక గిన్నెలో వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకోవాల్సి. తరువాత తమలపాకును ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసుకోవాలి. అలాగే ఆ తరువాత మెంతులను వేసుకోవాలి.తరువాత ఈ నూనెను చిన్న మంటపై వేడి చేయాలి. తమలపాకు బాగా వేగి క్రిస్పీగా అయ్యే దాకా ఈ నూనెను వేడి చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.తరువాత ఈ నూనెను పూర్తిగా చల్లారే దాకా అలాగే ఉంచాలి. నూనె చల్లారిన తరువాత వడకట్టి గాజు సీసాలో పోసి స్టోర్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను ఎలా వాడాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ నూనెను జుట్టు కుదుళ్ల నుండి చివరి దాకా బాగా పట్టించాలి.ఆ తరువాత నూనె చర్మంలోకి ఇంకేలా బాగా మర్దనా చేసుకోవాలి. దీనిని ఒక గంటపాటు అలాగే ఉంచి ఆ తరువాత శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇలా ఖచ్చితంగా వారానికి రెండు సార్లు చేయాలి. జుట్టు ఎక్కువగా రాలిపోతున్న వారు వారానికి ఇదే విధంగా  మూడు సార్లు చేయాలి.ఇంకా ఈ విధంగా మన ఇంట్లో ఉండే పదార్థాలతో నూనెను తయారు చేసుకుని వాడడం వల్ల మనం ఖచ్చితంగా చాలా సులభంగా జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. ఈ నూనె తయారీలో వాడిన ప్రతి పదార్థంలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ నూనెను వాడడం వల్ల జుట్టు ఒత్తుగా, నల్లగా ఇంకా అలాగే ధృడంగా పెరుగుతుంది. చుండ్రు సమస్య కూడా చాలా ఈజీగా నివారించబడుతుంది. అలాగే జుట్టు మృదువుగా, కాంతివంతంగా ఇంకా మెత్తగా కూడా తయారవుతుంది. జుట్టు సమస్యలతో బాధపడే వారు ఈ టిప్ ని ఉపయోగించడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలను సొంతం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: